Coconut Water Lemon Juice: కొబ్బరి బోండం నీళ్లలో నిమ్మ కాయ పిండుకుని తాగితే ఏం జరుగుతుందంటే..

ABN , First Publish Date - 2023-02-21T14:22:15+05:30 IST

కొబ్బరి నీళ్లను తాజాగా పిండిన నిమ్మరసంతో కలపడం రుచికరమైన పానీయంగా తీసుకోవడం వల్ల,

Coconut Water Lemon Juice: కొబ్బరి బోండం నీళ్లలో నిమ్మ కాయ పిండుకుని తాగితే ఏం జరుగుతుందంటే..
coconut water and lemon juice

ఎండలు పెరిగాయంటే.. దానితో పాటే దాహం కూడా పెరుగుతుంది. సమయానికి అందుబాటులో ఉండే కూల్ డ్రింక్స్, ఐస్ వాటర్‌తో పాటు కొబ్బరి బోండం తీసుకుంటే కూడా కాస్త ఆరోగ్యం పెరుగుతుందనే కారణంగా తాగేస్తూ ఉంటాం. అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన సూపర్‌ఫుడ్‌గా కొబ్బరి నీరు ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా, నిమ్మరసం కూడా విటమిన్ సి కలిగి ఉంటుంది కాబట్టి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే, ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే కొబ్బరి నీరు, నిమ్మరసం తీసుకోవడం ఆరోగ్యకరమా?

ఇలా చేయడంకన్నా కాస్త భిన్నంగా కొబ్బరి బోండంలో కాస్త నిమ్మకాయ కలిపి తాగడం వల్ల డీహైడ్రేషన్‌ను ఈజీగా ఎదుర్కోవడచ్చట. ఇది శక్తిని అందించడమే కాకుండా, చర్మ ఆరోగ్యానికి సహాయ పడుతుంది. వేసవి కాలం వస్తున్నందున, మన శరీరానికి హైడ్రేషన్ అవసరం.

నిమ్మకాయ, కొబ్బరి నీళ్ల కలిపి తీసుకోవడం శరీరానికి మంచి చేస్తుంది. ఇది విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది. ఇది సాధారణంగా శరీరంలో నీటిని భర్తీ చేయడానికి ఉపయోగపడుతుంది. నేచురల్ ఎనర్జీ డ్రింక్ అయినందున అథ్లెట్లకు ఇది మంచి ఛాయిస్, దీనిని పిల్లలు, వ్యాయామం తర్వాత గర్భిణీ స్త్రీలు కూడా తిసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: వీటి వల్లే మీ బీపీ సర్రున పెరిగిపోతుంది.. తెలుసుకుని జాగ్రత్త పడితే బెటర్..!

కొబ్బరి నీరు, నిమ్మకాయలు రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, ఇతర ఎలక్ట్రోలైట్‌లు ఎక్కువగా ఉంటాయి, ఇది డీహైడ్రేషన్‌తో చాలా సహాయపడుతుంది, అయితే నిమ్మకాయల్లో విటమిన్ సి , సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి, ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి.

కొబ్బరి నీళ్లను తాజాగా పిండిన నిమ్మరసంతో కలపడం రుచికరమైన పానీయంగా తీసుకోవడం వల్ల, రెండింటి ఆరోగ్య ప్రయోజనాలను కూడా శరీరానికి అందుతాయి. అయితే, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, రక్తపోటు సమస్యలు, కిడ్నీ పనిచేయకపోవడం ఉన్నవారు ఈ రెండిటినీ కలిపి తీసుకోకపోవడమే మంచిది.

Updated Date - 2023-02-21T14:36:14+05:30 IST