Narendra Modi: రూ.19,260 కోట్ల విలువైన ప్రాజెక్టులను నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2023-10-02T11:04:05+05:30 IST

త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది పనుల్లో వేగం పెంచారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూనే, మరోవైపు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.

Narendra Modi: రూ.19,260 కోట్ల విలువైన ప్రాజెక్టులను నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

భోపాల్: త్వరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ది పనుల్లో వేగం పెంచారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూనే, మరోవైపు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం తెలంగాణలో పర్యటించిన మోదీ రూ.13,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తాజాగా సోమవారం ప్రధాని మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పర్యటించనున్నారు. సుమారు రూ.19,260 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. దేశవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో దాదాపు రూ.11,895 కోట్లతో నిర్మించిన ఢిల్లీ-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని ప్రారంభించన్నన్నారు. అనంతరం ఢిల్లీ-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాని జాతికి అంకితం చేస్తారని ఒక అధికారి తెలిపారు. కాగా ఈ ఏడాది చివరలో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.


అలాగే రూ.1,880 కోట్ల విలువైన ఐదు వేర్వేరు రోడ్డు ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం కింద నిర్మించిన 2.2 లక్షలకు పైగా గృహాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా అర్బన్‌లో సుమారు రూ.140 కోట్లతో నిర్మించిన ఇళ్లను కూడా ఆయన జాతికి అంకితం చేస్తారని ఓ అధికారి తెలిపారు. దేశంలోని అన్ని గృహాలకు తాగు నీరు అందించాలనేది కేంద్ర ప్రభుత్వం ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా ఉంది. ఈ లక్ష్యంతో గ్వాలియర్, షియోపూర్ జిల్లాల్లో రూ.1,530 కోట్లతో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల గ్వాలియర్, షియోపూర్ జిల్లాలోని 720కి పైగా గ్రామాలకు లబ్ధి చేకూరనుంది.

ఇక ఆరోగ్య మౌలిక సదుపాయాలను మరింత పెంచే క్రమంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద తొమ్మిది ఆరోగ్య కేంద్రాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రూ.150 కోట్లకు పైగా వ్యయంతో వీటిని అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా ప్రధాన మంత్రి ఐఐటి ఇండోర్ అకడమిక్ భవనాన్ని ప్రధాని అంకితం చేయనున్నారు. అలాగే క్యాంపస్‌లో హాస్టల్, ఇతర భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇండోర్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్‌కు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఉజ్జయినిలోని ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్, ఐఓసీఎల్ (IOCL) బాట్లింగ్ ప్లాంట్, గ్వాలియర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి దివ్యాంగ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్, 38 కిలోమీటర్ల పొడవైన గ్వాలియర్-సుమాలి రైల్వే లైన్ గేజ్ మార్పిడితో సహా పలు ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు.

Updated Date - 2023-10-02T11:04:05+05:30 IST