Share News

Covid 19: కేరళను వణికిస్తోన్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..?

ABN , Publish Date - Dec 21 , 2023 | 10:08 AM

కేరళ రాష్ట్రాన్ని కరోనా మళ్లీ వణికిస్తోంది. కొత్త వేరియంట్ ప్రభావంతో ఇటీవల మళ్లీ నమోదవుతున్న కరోనా కేసులు కేరళ వాసులను భయపెడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కేరళలో కొత్తగా 292 కరోనా కేసులు నమోదయ్యాయి.

Covid 19: కేరళను వణికిస్తోన్న కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే..?

తిరువనంతపురం: కేరళ రాష్ట్రాన్ని కరోనా మళ్లీ వణికిస్తోంది. కొత్త వేరియంట్ ప్రభావంతో ఇటీవల మళ్లీ నమోదవుతున్న కరోనా కేసులు కేరళ వాసులను భయపెడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం కేరళలో కొత్తగా 292 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం నాటికి కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 2 వేలు దాటింది. ప్రస్తుతం కేరళలో 2041 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న కరోనా యాక్టివ్ కేసుల్లో కేరళలోనే 88 శాతం ఉండడం గమనార్హం. కరోనా కారణంగా కేరళలో గత 24 గంటల్లో ఇద్దరు చనిపోయారు. దీంతో కరోనా కారణంగా కేరళలో ఇప్పటివరకు 72,056 మంది చనిపోయారు.


రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. భయాందోళనలను వదిలి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. తాజా కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న తిరువనంతపురం, ఎర్నాకులం జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించారు.రాష్ట్రంలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్లు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని వచ్చిన వార్తలను ఆరోగ్య మంత్రి సోమవారం ఖండించారు. కాకపోతే నవంబర్ నుంచి రాష్ట్రంలో కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదవుతుందని పేర్కొన్నారు. కాగా సింగపూర్ విమానాశ్రయంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15 మందికి కరోనా జేఎన్.1 (JN.1) సబ్-వేరియంట్‌ పాజిటివ్‌గా తేలింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 21 , 2023 | 10:08 AM