Rahul Gandhi : బంగళా ఖాళీ చేయమన్నందుకు రాహుల్ గాంధీ సమాధానం ఇదే!
ABN , First Publish Date - 2023-03-28T12:46:11+05:30 IST
పరువు నష్టం కేసులో రెండేళ్ళ జైలు శిక్ష పడటంతోపాటు లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ : పరువు నష్టం కేసులో రెండేళ్ళ జైలు శిక్ష పడటంతోపాటు లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ప్రస్తుతం నివసిస్తున్న అధికారిక బంగళాను ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్ కమిటీ సోమవారం ఇచ్చిన నోటీసులకు సానుకూలంగా స్పందించారు.
రాహుల్ 12, తుగ్లక్ లేన్‌లోని బంగళాలో 2005 నుంచి ఉంటున్నారు. ప్రభుత్వం కేటాయించిన ఈ అధికారిక నివాసాన్ని 30 రోజుల్లో (ఏప్రిల్ 22)గా ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్ కమిటీ నోటీసులో కోరింది.
ఈ నోటీసుపై రాహుల్ గాంధీ మంగళవారం స్పందించి, లోక్‌సభ సచివాలయం, ఎంఎస్ బ్రాంచ్, డిప్యూటీ సెక్రటరీకి ఓ లేఖ రాశారు. నాలుగు పదవీ కాలాల నుంచి లోక్‌సభ సభ్యునిగా తాను వ్యవహరిస్తున్నానని తెలిపారు. ఇది ప్రజా తీర్పు అని తెలిపారు. ఈ నివాసంలో గడిపిన సమయంలో తనకు మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయన్నారు. తన హక్కుల గురించి ఎటువంటి అభిప్రాయాలు లేకుండా తాను ఈ నోటీసులో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉంటానని తెలిపారు. బంగళాను ఖాళీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
Gold and Silver Price : పెరగడమేమో వేలల్లో.. తగ్గితే పైసల్లో..
America : రాహుల్ గాంధీ అనర్హతపై అమెరికా సంచలన వ్యాఖ్యలు
Rahul: రాహుల్.. ఇల్లు ఖాళీ చేయండి!