Howrah clashes : హౌరాలో రెచ్చిపోతున్న అల్లరి మూకలు... బీజేపీపై మమత ఆగ్రహం...

ABN , First Publish Date - 2023-03-31T15:31:44+05:30 IST

శ్రీరామ నవమి (Shree Rama Navami) శోభాయాత్ర సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని హౌరా (Howrah)లో గురువారం

Howrah clashes : హౌరాలో రెచ్చిపోతున్న అల్లరి మూకలు... బీజేపీపై మమత ఆగ్రహం...
Howrah

కోల్‌కతా : శ్రీరామ నవమి (Shree Rama Navami) శోభాయాత్ర సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని హౌరా (Howrah)లో గురువారం నుంచి రాళ్ల దాడులు జరుగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ, శుక్రవారం కూడా రాళ్ల దాడులు జరిగాయి. ఈ పారిశ్రామిక నగరంలో ఉద్రిక్తతలు పెరగడంతో ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) ప్రతిపక్ష బీజేపీ (BJP), బజరంగ్ దళ్ (Bajrang Dal), ఇతర సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘హౌరాలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. హౌరాలో జరిగిన హింసాకాండలో హిందువులు, ముస్లింలు లేరు. ఆయుధాలతో జరిగిన హింసాకాండలో బీజేపీ, బజరంగ్ దళ్, అటువంటి ఇతర సంస్థల ప్రమేయం ఉంది’’ అని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హింసాకాండలో ఆస్తులను కోల్పోయినవారికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హింసాకాండకు సంబంధించిన కేసులో 31 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

కాజీపర ప్రాంతంలో గురువారం జరిగిన హింసాకాండపై టీఎంసీ, బీజేపీ నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు చెప్తున్నారు. ఈ హింసాకాండలో పోలీసు వాహనాలతోపాటు పలు వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి.

ఇవి కూడా చదవండి :

Digvijaya Vs Kapil : దిగ్విజయ సింగ్‌పై కపిల్ సిబల్ ఆగ్రహం

Amritpal Singh : అమృత్‌పాల్ సింగ్ రెండో వీడియో... లొంగుబాటు, ప్రాణ భయంపై వివరణ...

Updated Date - 2023-03-31T15:33:08+05:30 IST