Congress Vs BJP : స్వదేశాన్ని అవమానిస్తున్న రాహుల్ గాంధీ : రవిశంకర్ ప్రసాద్

ABN , First Publish Date - 2023-03-07T15:09:21+05:30 IST

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) భారత దేశాన్ని అవమానిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్

Congress Vs BJP : స్వదేశాన్ని అవమానిస్తున్న రాహుల్ గాంధీ : రవిశంకర్ ప్రసాద్
Rahul Gandhi , Ravishankar Prasad

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) భారత దేశాన్ని అవమానిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ (Ravi Shankar Prasad) ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్‌కు వెళ్ళి భారత దేశ ప్రజాస్వామ్యం, రాజనీతి, పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, భద్రతలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. మన దేశంలో విదేశీ జోక్యాన్ని కోరుతున్నారన్నారు. ఈ వ్యాఖ్యలను సమర్థిస్తారా? అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress president Mallikarjun Kharge)ను, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)ని ప్రశ్నించారు. ఒకవేళ ఈ వ్యాఖ్యలను సమర్థించకపోతే, వాటితో తమకు సంబంధం లేదని స్పష్టం చేయాలని కోరారు.

రాహుల్ గాంధీ బ్రిటన్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, యూరోపు, అమెరికా దేశాలు భారత దేశం నుంచి వ్యాపార, వాణిజ్యాలను, ఆదాయాన్ని పొందుతున్నాయని, భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు ఆ దేశాలు చేయవలసినంత చేయడం లేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

రవిశంకర్ ప్రసాద్ మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ బ్రిటన్‌లో ఇచ్చిన ప్రసంగాల్లో భారత దేశాన్ని అవమానించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. భారత దేశ ప్రజాస్వామ్యం, రాజనీతి, పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, భద్రతలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. మన దేశంలో విదేశీ జోక్యాన్ని కోరుతున్నారన్నారు.

‘‘భారత దేశ ప్రజాస్వామ్యం, రాజనీతి, పార్లమెంటు, రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలను అవమానించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించారని బీజేపీ తీవ్ర ఆవేదనతో నొక్కి వక్కాణిస్తోంది’’ అని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా, యూరోపియన్ యూనియన్ జోక్యం చేసుకోవాలని రాహుల్ గాంధీ కోరడం అత్యంత బాధ్యతారహితమని, దీనిపై ఖర్గే, సోనియా గాంధీ తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)ను ముస్లిం బ్రదర్‌హుడ్‌తో పోల్చడాన్ని కూడా ప్రసాద్ తప్పుబట్టారు. ఆరెస్సెస్ జాతీయవాద సంస్థ అని తెలిపారు. తామంతా స్వయంసేవకులమని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామన్నారు. రాహుల్ గాంధీ పూర్తిగా మావోయిస్టు ఆలోచనా విధానం కబంధ హస్తాల్లో చిక్కుకున్నారన్నారు.

గతంలో రక్షణ మంత్రిగా పని చేసిన దివంగత ఏకే ఆంటోనీ అధికారికంగా చైనాపై తెలిపిన వైఖరిని రవిశంకర్ ప్రసాద్ ప్రస్తావించారు. ‘‘సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా చైనాను ఇబ్బంది పెట్టాలని మేం అనుకోవడం లేదు’’ అని ఆంటోనీ గతంలో అన్నారని ప్రసాద్ గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఇటీవల బ్రిటన్‌లో మాట్లాడుతూ, చైనా ముప్పును విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అర్థం చేసుకోవడం లేదని ఆరోపించిన నేపథ్యంలో ప్రసాద్ ఈ ప్రస్తావన చేశారు.

ఇవి కూడా చదవండి :

Miss Asia: ఆడవాళ్ళ బాడీ ఫిట్‌గా ఉన్నా తప్పే.. మగవాళ్ళలా ఉన్నారనే కామెంట్స్ తప్పవు..!

Nagaland: నాగాలాండ్ సీఎంగా నెఫియూ రియో ప్రమాణస్వీకారం

Updated Date - 2023-03-07T16:20:18+05:30 IST