Eat Chia Seeds: చియా గురించి మీకేం తెలుసు? ఇందులో ఎన్ని పోషకాలున్నాయంటే.. !

ABN , First Publish Date - 2023-03-23T12:13:08+05:30 IST

చియా సీడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి.

Eat Chia Seeds: చియా గురించి మీకేం తెలుసు? ఇందులో ఎన్ని పోషకాలున్నాయంటే.. !
energy drinks

మ‌న శ‌రీరానికి పోష‌కాల‌ను అందించే ఆహారాల్లో చియా విత్త‌నాలు కూడా ఒక‌టి. ఇవి అనేక పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వీటి వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్యక‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చియా విత్తనాలు ఇవి అవిసె గింజలు, జనపనార గింజలు , స్పిరులినా లాంటివే.

ప్రతి సంవత్సరం మార్చి 23న జరుపుకునే జాతీయ చియా దినోత్సవం సందర్భంగా, చియా గింజలు 3500 సంవత్సరాలకు పైగా వాడుకలో ఉన్నాయి, అయితే అవి 2016లో సరైన గుర్తింపును పొందాయి. అవి ఈ గ్రహం మీద అరుదైన సూపర్‌ఫుడ్‌లలో ఒకటిగా పిలువబడే చిన్న, శక్తివంతమైన విత్తనాలు.

చియా విత్తనాలు అన్ని పోషకాలతో నిండి ఉన్నాయి. విటమిన్లు, ఖనిజాల నుండి ప్రోటీన్లు, ఫైబర్స్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల వరకు, అవి పోషక ప్రయోజనాల సుదీర్ఘ జాబితా ఉంది. ఈ 'చియా విత్తనాలు' దక్షిణ, మధ్య మెక్సికోకు చెందినది. 20వ శతాబ్దానికి ఓ గొప్ప ఆహార కానుక. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్‌లు, టన్నుల కొద్దీ ఇతర సూక్ష్మపోషకాలతో కూడిన చియా విత్తనాలు 'సూపర్ ఫుడ్'గా చెప్పచ్చు.

1. చియా విత్త‌నాల్లో ఫైబ‌ర్, ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, కాల్షియం, మాంగ‌నీస్‌, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్, జింక్, విట‌మిన్ బి3, పొటాషియం, విట‌మిన్ బి1, విట‌మిన్ బి2 వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన శ‌రీరానికి పోష‌ణ‌ను, శ‌క్తిని అందిస్తాయి.

2. చియా సీడ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్ బారి నుంచి మ‌న శ‌రీరాన్ని ర‌క్షిస్తాయి. దీంతో క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

3. చియా విత్తనాల్లో ఉండే ఫైబ‌ర్ అధిక బ‌రువును త‌గ్గించేందుకు స‌హాయ ప‌డుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకాలి వేయకుండా ఉంటుంది. ఆక‌లి నియంత్ర‌ణ అవుతుంది. దీనితో తక్కువ ఆహారం తీసుకుంటారు. ఫలితంగా బరువు తగ్గవచ్చు.

ఇది కూడా చదవండి: పిల్లాడు బొద్దుగా ఉన్నాడని మురిసిపోకండి.. అది ఊబకాయం కావచ్చు.

4. చియా సీడ్స్‌లో ప్రోటీన్లు స‌మృద్ధిగా ఉంటాయి. మాంసాహారం తిన‌లేని వారికి ఈ విత్త‌నాల ద్వారా ప్రోటీన్లు అధికంగా ల‌భిస్తాయి. చియా విత్త‌నాల‌ను నిత్యం తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన ప్రోటీన్లు ల‌భిస్తాయి.

5. చియా విత్త‌నాల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని సంర‌క్షిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గిస్తాయి.

6. చియా విత్త‌నాల్లో కాల్షియం, ఫాస్ప‌ర‌స్‌, మెగ్నిషియం, ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక ఎముక‌లు దృఢంగా ఉంటాయి.

7. నిత్యం చియా సీడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి. సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ విష‌యం వెల్ల‌డైంది.

8. వాపులను తగ్గించ‌డంలోనూ చియా విత్త‌నాలు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఆర్థ‌రైటిస్ వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి ఇవి మేలు చేస్తాయి. చియా సీడ్స్‌ను నిత్యం నేరుగా తీసుకోవ‌చ్చు. లేదా వాటి పొడిని జ్యూస్‌లు, స‌లాడ్‌లు, మ‌జ్జిగ వంటి ప‌దార్థాల‌తో క‌లిపి తీసుకోవ‌చ్చు.

Updated Date - 2023-03-23T12:13:08+05:30 IST