Obesity in children: పిల్లాడు బొద్దుగా ఉన్నాడని మురిసిపోకండి.. అది ఊబకాయం కావచ్చు.

ABN , First Publish Date - 2023-03-22T13:29:21+05:30 IST

పిల్లలు చలాకీగా అందరిలా ఆడుకోలేక బాధపడేవారున్నారు.

Obesity in children: పిల్లాడు బొద్దుగా ఉన్నాడని మురిసిపోకండి.. అది ఊబకాయం కావచ్చు.
Obesity in children

WHO ప్రకారం అధిక బరువుతో బాధపడేవారు. ముఖ్యంగా పిల్లల సంఖ్యను ఓ జాబితా వేస్తే, భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఈ విషయంగా అందరి తల్లిదండ్రులలోనూ అవగాహన రావడం చాలా అవసరం. పిల్లాడు బొద్దుగా ఉన్నాడని వాడికి చిన్నవయసు నుంచే ప్రతీదీ కొని పెట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలను చేజేతులారా పాడు చేసినవాళ్ళవుతారు. 2020 తరవాత ఐదేళ్ళ లోపు చిన్నరులంతా దాదాపు 39 మిలియన్ పిల్లలు ఈ స్థూలకాయంతో బాధపడుతున్నవారున్నారు.

అధిక బరువుతో బాధపడే పిల్లల దేశాలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఇటీవల కాలంలో పిల్లల్లో ఊబకాయం అనేది గుండె సమస్యకు కూడా కారణం అవుతుంది. నిద్రపోయినపుడు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, కీళ్ళ సమస్య కూడా ఈ ఊబకాయంతో వస్తున్నాయి. అనేకమంది పిల్లలు చలాకీగా అందరిలా ఆడుకోలేక బాధపడేవారున్నారు. అంతే కాకుండా., వీరికి పెద్దయిన తరువాత కూడా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: సీజన్ మారేటప్పుడు ఈ 6 ఆహార పదార్థాలు తింటే చాలు.. మీ ఆరోగ్యం భేష్ !

అయితే పిల్లలకు ఒకప్పటిలా ఆటలాడుకునేందుకు స్థలాలు లేకపోవడం, అపార్ట్ మెంట్ కల్చర్ పెరిగిపోవడం, స్వీట్స్, జంక్ ఫుడ్ అదే పనిగా తినడం వాటివల్ల కూడా ఈ ఊబకాయం వస్తుంది.

Updated Date - 2023-03-22T13:29:21+05:30 IST