Share News

Devineni uma: వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ దేవినేని ఉమ

ABN , First Publish Date - 2023-11-03T15:10:00+05:30 IST

పట్టిసీమ ఒక నాయకుడి విజన్, ఆలోచన, ఆచరణ. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మను గోదావరి తల్లిని పవిత్ర సంగమంలో కలిపిన ఒక మహా నాయకుడిని రాజమండ్రి జైల్లో నిర్బంధం చేశారు. విశాఖలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ మీద సదస్సు జరుగుతుంది

Devineni uma: వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ దేవినేని ఉమ

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) జాతి సంపద సృష్టించేవారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ (Devineni uma) అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును దేవినేని ఉమ సందర్శించి.. గోదావరికి పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘పట్టిసీమ ఒక నాయకుడి విజన్, ఆలోచన, ఆచరణ. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మను గోదావరి తల్లిని పవిత్ర సంగమంలో కలిపిన ఒక మహా నాయకుడిని రాజమండ్రి జైల్లో నిర్బంధం చేశారు. విశాఖలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ మీద సదస్సు జరుగుతుంది. ప్రభుత్వం ఐదు కోట్లు ఖర్చు పెడుతుంది. దీని గురించి సీఎం ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదు. 90 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. విద్యార్థులు, ఇంజనీర్లు ఉన్నారు. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి షెకావత్ కూడా ఉన్నారు. ఒక్క మాట కూడా నదుల అనుసంధానం గురించి ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నువ్వు అర్హుడవా?, 151 మంది ఎమ్మెల్యేల్లో ఒక్కడైనా వచ్చి ఈ పట్టిసీమ నేలను చూశారా?.’’ అని ప్రశ్నించారు.

‘‘పట్టిసీమ కట్టినోడు 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. చేతకాని ముఖ్యమంత్రి, అసమర్థులైన మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రానికి అవసరమా?, పక్క రాష్ట్రంలో కాళేశ్వరం ప్రారంభోత్సవానికి డ్రామాలాడి వెళ్లి కొబ్బరికాయలు కొట్టి వచ్చారు. రూ.1600 కోట్లు ఖర్చుపెట్టిన పట్టిసీమ రూ.50 వేల కోట్ల సంపాదన సృష్టించింది. ఇక్కడ 24 పంపులు ఉంటే నీళ్ల అవసరం ఎక్కువగా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో 18 పంపులు ఆడిస్తున్నారంటే ఇంత చేతగాని పనికిమాలిన ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఎవరైనా ఉంటారా?, అదే చంద్రబాబు ఈ కష్టకాలంలో ముఖ్యమంత్రిగా ఉంటే 24 పంపులు ఆడించి.. 100 టీఎంసీలు గోదావరి నీళ్లు తీసుకెళ్లేవారు. బుల్లెట్ దింపుతాను అన్నవాడు అడ్రస్ లేకుండా పోయాడు ! ఇప్పుడున్న ఇరిగేషన్ మంత్రి పోలవరం గురించి నన్ను అడగవద్దు అంటూ చేతులెత్తేశాడు!, ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేను అన్నారు.’’ అని విమర్శించారు.

Updated Date - 2023-11-03T15:10:01+05:30 IST