TDP: ‘‘అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి’’

ABN , First Publish Date - 2023-05-05T20:06:49+05:30 IST

రాష్ట్రంలో పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా 4 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు..

TDP: ‘‘అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి’’

పోలవరం (Polavaram): రాష్ట్రంలో పది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా 4 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని టీడీపీ (TDP) నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రోజుల తరబడి కురుస్తున్న భారీ వర్షాలతో (Heavy rains) కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పంటలు నీటిలో మునిగిపోయాయని తెలిపారు. ధాన్యంతో పాటు పోగాకు, మిరప, మొక్కజొన్న, పసుపు, శనగ, వేరుశనగ, మామిడి, అరటి, ఇతర ఉద్యాన పంటలు బొప్పాయి, నిమ్మ, దెబ్బతిని (Damaged crops) రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారన్నారు.

అకాల వర్షాలకు దెబ్బతిన్న, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రబీ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. నష్టపోయిన వరి, మొక్కజొన్న రైతులకు (Farmers) ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారం (Compensation) అందజేయాలని చెప్పారు. అలాగే మిర్చి, అరటి, మామిడి రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలని తెలిపారు. పిడుగుపాటు గురై మరణించిన ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల పరిహారం అందించాలన్నారు. అధికారులు స్పందించి పంట నష్టం అంచనా వేసి, త్వరితగతిన పరిహారం అందించాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగు రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కుంచే దొరబాబు, టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు పాపోలు గణపతి రత్తయ్య, ప్రధాన కార్యదర్శి నూనకానీ రాంబాబు, సర్పంచ్ సబ్బారపు శ్రీరామ్మూర్తి, పార్టీ పట్టణ అధ్యక్షుడు పోతుల శ్రీనివాసరావు, క్లస్టర్ ఇంచార్జి ఆకుల రాజా, జల్లేపల్లి నరసింహారావు, పాదం ప్రసాద్, కొత్తపల్లి సత్యనారయణ, సోమరౌతు వెంకటేశ్వరరావు, ఎడ్ల వినోద్, కుంచె రాజేష్, రెల్లి కొండబాబు, మాగంటి రాము, కొత్తపల్లి సతీష్, జల్లేపల్లి కార్తిక్, సున్నం సుధీర్, పిల్లి నాగరాజు, పీవీవీ సత్యనారయణ, కొండే ఏసుబాబు, జల్లేపల్లి జితేంద్ర, వారా ఏసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-05T20:06:49+05:30 IST