Share News

Nara Lokesh: టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ 229 అమలు చేస్తాం

ABN , Publish Date - Dec 17 , 2023 | 04:01 PM

లుగుదేశం పార్టీ ( Telugu Desam Party ) అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ 229 అమలు చేస్తామని టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) పేర్కొన్నారు.

Nara Lokesh: టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ 229 అమలు చేస్తాం

అనకాపల్లి జిల్లా: తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party ) అధికారంలోకి వచ్చిన వెంటనే జీఓ 229 అమలు చేస్తామని టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) పేర్కొన్నారు. ఆదివారం నాడు పరవాడ సంతబయలు వద్ద పంచగ్రామల ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ...‘‘పంచగ్రామాల ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు. ఈ సమస్య పై నాకు పూర్తి అవగాహన ఉంది. 12 వేల ఎకరాలు, 18 వేల ఇళ్లకు సంబంధించిన సమస్య ఇది. లక్ష మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, వైద్యం, ఇతర అవసరాల కోసం ఆస్తులు అమ్ముకునే హక్కు లేకుండా పోయింది. కనీసం ఇంటి రిపేర్లు చేసుకునే పరిస్థితి లేదు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసింది చంద్రబాబు. జీఓ 578 తీసుకొచ్చి రెగ్యూలరైజ్ చేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించింది.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి డబ్బులు కట్టోద్దు. నేను వచ్చి ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీ వేసి సమస్యను మరింత జఠిలం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి చంద్రబాబు ప్రయత్నం చేశారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పంచగ్రామాల సమస్య పరిష్కారానికి కృషి చేశారు’’ అని నారా లోకేష్ తెలిపారు.

జీఓ 229 అమలు కాకుండా నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం కాలక్షేపం

‘‘వైసీపీ లీగల్ సెల్‌లో పనిచేసే వారు కోర్టుకి వెళ్లి జీఓ 229 అమలు కాకుండా చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నెలలో సమస్య పరిష్కారిస్తానని పాదయాత్ర సమయంలో జగన్‌రెడ్డి హామీ ఇచ్చాడు. బిల్డప్ బాబాయ్ అదీప్ రాజ్ ఎమ్మెల్యే అయిన వెంటనే సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి చెతులేత్తేశాడు. నాలుగున్నరేళ్లుగా కమిటీ పేరుతో వైసీపీ ప్రభుత్వం కాలక్షేపం చేసింది. ఈ జీవోపై ఒక్క అడుగు ముందుకు వెళ్లలేదు. సమస్య పరిష్కారానికి కృషి చేసింది టీడీపీ. సమస్య పరిష్కారం కాకుండా అడ్డుకుంది వైసీపీ. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. ఇళ్ల సమస్యతో పాటు రైతుల సమస్యను కూడా పరిష్కరిస్తాం. టీడీపీ హయాంలో ఇళ్లు రిపేర్లు చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం. వైసీపీ ప్రభుత్వం కనీసం రిపేర్లు కూడా చేయలేదు’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 04:01 PM