MP Raghurama: ‘సీఎం విశాఖకు వెళ్లొచ్చు.. అవసరం లేని వాడు కోటలో ఉన్న పేటలో ఉన్న ఒకటే’

ABN , First Publish Date - 2023-02-09T14:00:49+05:30 IST

అమరావతే రాజధాని అంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశలకు నీళ్లు చల్లినట్లైందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

MP Raghurama: ‘సీఎం విశాఖకు వెళ్లొచ్చు.. అవసరం లేని వాడు కోటలో ఉన్న పేటలో ఉన్న ఒకటే’

న్యూడిల్లీ: అమరావతే రాజధాని (AP Capital Amaravati) అంటూ పార్లమెంట్ (Parliament) సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM JaganMohan Reddy) ఆశలకు నీళ్లు చల్లినట్లైందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghuramkrishna Raju) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి విశాఖ (Visakhapatnam) కు వెళ్తే వెళ్లొచ్చన్నారు. అవసరం లేని వాడు కోటలో ఉన్న పేటలో ఉన్న ఒకటే అంటూ వ్యాఖ్యలు చేశారు. నిన్న పార్లమెంట్ ఎంపీ విజయసాయిరెడ్డి (MP VijayasaiReddy)అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిందని తెలిపారు. రాజధాని అధికారం రాష్ట్రాలదని అడిగారన్నారు. అమరావతిని కేంద్రం రాజధానిగా అంగీకరించి 2500 కోట్లు గ్రాంట్ ఇచ్చిందని గుర్తుచేశారు. రాజ్‌భవన్, హైకోర్టు, సెక్రటేరియట్‌కు నిధులు ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు అంటే హైకోర్టు కేసును కొట్టేసిందని తెలిపారు. ప్రశ్న అడిగిన సాయిరెడ్డికి ఎంపీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జరిగిందని... మళ్ళీ రాజధాని చేయాలంటే పార్లమెంట్‌లో చట్టం చేయాలన్నారు.

‘‘ఓ పత్రికలో రాజధానికి మాకు సంబధం లేదని రాశారు బుద్ధి ఉందా. కేంద్రం వేసిన అఫిడవిట్ ఏంటి మీరు రాసిన వార్త ఏంటి’’ అని ప్రశ్నించారు. విశాఖ రాజధాని అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) నర్మగర్భంగా మాట్లాడుతున్నారన్నారు. విశాఖలో రిషికొండ (Rishikonda)కు ఎదురుగా ఉన్న కొండపై ముఖ్యమంత్రి నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిపారు. పట్టపగలు రాబరీ చేస్తున్నారని.. నీచమైన అబద్ధాలు ఆడుతున్న ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు చూడలేదని విమర్శించారు. టూరిజం పేరు మీద నిర్మాణాలు చేసి సీఎం కార్యాలయంగా మార్చుకుంటున్నారన్నారు. అధికారులను రూమ్స్ అద్దెలు తీసుకోవాలని ప్రభుత్వం చెబుతోందన్నారు. ఒక్కడి స్వార్థం కొరకు కొన్ని వేల కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్నారని మండిపడ్డారు. అంతిమంగా న్యాయాన్ని ఆపలేరని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.

అలాంటి వారికి మంత్రి పదవి ఇవ్వొచ్చు.. కానీ

రెండేళ్ల క్రితం తనకు జరిగిన అన్యాయాన్ని ఎంపీ రఘుమార మరోసారి గుర్తు చేశారు. రెండేళ్ల క్రితం సీఎం జగన్ (AP CM)డైరెక్షన్‌లో తనను దారుణంగా పోలీసులు (Police) హింసించారన్నారు. వారికి ఇప్పుడు హైకోర్టులో నోటీసులు ఇచ్చారని.. న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సునీల్ కుమార్ అమెరికాలో గొల్ఫ్స్ ఆడుకుంటున్నారన్నారు. తన ప్రాణాల రక్షణ కొరకు ప్రతిపక్ష నేతలు అండగా నిలబడ్డారని... ముఖ్యంగా చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) కు కృతజ్ఞతలు తెలియజేశారు. నాలుగేళ్లు ప్రభుత్వం సైలెంట్‌గా ఉండి షాధి ముబారక్ సహాయం అంటున్నారని... అంతకు ముందు పెళ్లి చేసుకున్నవారికి కానుక ఇవ్వరంటా అంటూ ఎద్దేవా చేవారు. ఆరవ తరగతి చదివిన వారికి మంత్రి పదవి ఇవ్వొచ్చు.. కానీ మీ పథకాలు తీసుకోవాలంటే పదో తరగతి పాస్ అవ్వాలా.. ఏంటి ఇది అంటూ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-02-09T14:03:13+05:30 IST