Minister Rajini: ఆరోగ్యశ్రీ పేరు ఎత్తే అర్హత చంద్రబాబు, లోకేష్‌కు లేదు

ABN , First Publish Date - 2023-07-08T15:28:07+05:30 IST

ఆరోగ్యశ్రీ(Arogyashri) పేరు ఎత్తే అర్హత తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu), ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌(Lokesh )కు లేదని మంత్రి విడుదల రజిని(Minister Rajini) అన్నారు.

Minister Rajini: ఆరోగ్యశ్రీ పేరు ఎత్తే అర్హత చంద్రబాబు, లోకేష్‌కు లేదు

కృష్ణాజిల్లా: ఆరోగ్యశ్రీ(Arogyashri) పేరు ఎత్తే అర్హత తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu), ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌(Lokesh )కు లేదని మంత్రి విడుదల రజిని(Minister Rajini) అన్నారు. శనివారం గుడివాడ(Gudivada)లో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి 2ను ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి ప్రారంభించారు.ఆస్పత్రి ప్రాంగణంలో వైఎస్సార్(YSR) విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో 90% కుటుంబాలు ఆరోగ్యశ్రీతో లబ్ది పొందాయన్నారు.

వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా వైద్య, ఆరోగ్య రంగంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. దమ్ముంటే తన ఐదేళ్ల పాలలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. మ్యానిఫెస్టో అంటూ చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. నమ్మకం కోల్పోయిన చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మరని చెప్పారు.

ఇచ్చిన హామీలు పూర్తి చేసిన జగన్ ప్రజలకు భరోసా ఇచ్చారన్నారు. చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేసిన గుడివాడలో కొడాలి నానిని ఓడించడం అసాధ్యం...... టీడీపీ నేతలు డైలాగులుకే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజలు, సీఎం జగన్‌తో పాటుగా కొడాలి నానికు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయని మంత్రి విడుదల రజిని అన్నారు.

వైద్యరంగంల్లో మార్పులు తెచ్చిన వైఎస్సార్ : కొడాలి నాని

వైఎస్సార్ వైద్యుడు కాబట్టే సీఎంగా వైద్య రంగంలో ఎన్నో మార్పులు తెచ్చి..... దేశానికే ఆదర్శంగా నిలిచారని ఎమ్మెల్యే కొడాలి నాని(MLA Kodali Nani)చెప్పారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy)కృషితో ఆరోగ్య శ్రీ,108, 104 వైద్య సేవలు మారుమూల గ్రామాలకు చేరుతున్నాయన్నారు. చంద్రబాబు హయాంలో 108, 104 వాహనాలు షెడ్డుకే పరిమితం అయ్యాయని చెప్పారు.వైఎస్సార్ లేకుంటే ఆరోగ్యశ్రీ అనే పథకం రాకా లక్షలాదిమంది ప్రజలు ఇబ్బందులు పడేవారన్నారు.ప్రజల ఇబ్బందులను తెలుసుకొని నూతన ఆస్పత్రిని నిర్మించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే కొడాలి నాని కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-07-08T20:22:27+05:30 IST