Nara Lokesh: కొందరు ఖాకీలు పోలీసు వ్యవస్థకే మచ్చ తెస్తున్నారు
ABN , First Publish Date - 2023-11-21T15:24:50+05:30 IST
అధికార పార్టీ నేతల తొత్తులుగా మారిన కొందరు ఖాకీలు పోలీసు వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) అన్నారు.

అమరావతి: అధికార పార్టీ నేతల తొత్తులుగా మారిన కొందరు ఖాకీలు పోలీసు వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) అన్నారు. మగళవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో లోకేష్ మీడియాతో మాట్లాడుతూ...‘‘మంత్రాలయం నియోజకవర్గం కోసిగి ఐటీడీపీ అధ్యక్షుడు షేక్.హుస్సేన్ బాషాపై ఎస్ఐ విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచారు. టీడీపీ అంటే అంత ఇష్టమా అని ఎస్ఐ సతీష్ కుమార్ దుర్భాషలాడటం, స్టేషన్‌కి పిలిచి కొట్టడం దారుణం. అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్న హుస్సేన్ బాషాను...రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని అబద్ధం చెప్పి పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. హుస్సేన్ బాషాకు పార్టీ అండగా ఉంటుంది’’ అని నారా లోకేష్ భరోసా కల్పించారు.