Divyavani: ఆ గుర్తింపు లేకుంటే టీడీపీకి ఇబ్బందులే..

ABN , First Publish Date - 2023-09-25T22:22:53+05:30 IST

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఆలోచనలు, పరిపాలన ఆంధ్రప్రదేశ్‌కు అవసరమని సినీనటి దివ్యవాణి(Divyavani) వ్యాఖ్యానించారు.

 Divyavani: ఆ గుర్తింపు లేకుంటే టీడీపీకి ఇబ్బందులే..

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ఆలోచనలు, పరిపాలన ఆంధ్రప్రదేశ్‌కు అవసరమని సినీనటి దివ్యవాణి(Divyavani) వ్యాఖ్యానించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించారు. ఈ సందర్భంగా దివ్యవాణి ఏబీఎన్‌తో మాట్లాడుతూ..‘‘ చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం బాధ కలిగించింది. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను త్వరలో కలసి సంఘీబావం తెలియజేస్తాను. టీడీపీ నుంచి బయటకు వచ్చినప్పటికీ.. నాయకుడిగా చంద్రబాబును అభిమానిస్తాను. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఉందని స్వయంగా కేటీఆర్ పలుమార్లు చెప్పారు. చుట్టూ ఉన్న నేతలు చంద్రబాబు, లోకేష్‌ను మిస్‌గైడ్ చేయడంతోనే టీడీపి ఇబ్బందులు పాలవుతోంది. టీటీడీ కోసం కష్టపడేవారి గురించి చంద్రబాబు, లోకేష్‌కు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వకుంటే టీడీపీకి ఇబ్వందులు తప్పవు. చంద్రబాబు అరెస్ట్‌పై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పునరాలోచన చేయాలి. చంద్రబాబు విజన్ ఉన్న నేతను ఇబ్బంది పెట్టడం సరైంది కాదు’’ అని దివ్యవాణి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-25T22:23:02+05:30 IST