Bendapudi school: బెండపూడి విద్యార్థుల అమెరికన్ ఇంగ్లీష్ వెనుక అసలు కథ ఇదీ

ABN , First Publish Date - 2023-02-24T11:13:10+05:30 IST

జిల్లాలోని బెండపూడి హైస్కూల్‌లో విద్యార్థులు అమెరికన్ ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యం అసలు గుట్టు బయటపడింది.

Bendapudi school: బెండపూడి విద్యార్థుల అమెరికన్ ఇంగ్లీష్ వెనుక అసలు కథ ఇదీ

కాకినాడ: జిల్లాలోని బెండపూడి హైస్కూల్‌లో విద్యార్థుల (Bedapudi Highschool Student) అమెరికన్ ఇంగ్లీష్ (American English) భాషా ప్రావీణ్యం అసలు గుట్టు బయటపడింది. ప్రభుత్వ హైస్కూల్లో (Government High School) చదువుతూ అద్భుతంగా అమెరికా ఇంగ్లీష్‌ను ఉచ్ఛరించడం అంతా ఒట్టిదేనని తేలిపోయింది. కేవలం అది బట్టీయే అని, గొప్పల కోసం బయటకు ప్రచారం చేయడం కోసమే కొందరు విద్యార్థులను ఎంపిక చేసి డబ్బా కొట్టించారన్న నిజం తేలిపోయింది.

నిజం బయటపడింది ఇలా...

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉషా కుమారి (retired IAS Usha Kumari ) గురువారం బెండపూడి హైస్కూల్‌ను సందర్శించారు. కొందరు విద్యార్థులతో (Students) ఆమె మాట్లాడారు. కేవలం బట్టిపట్టిన అమెరికా ఆంగ్లం మినహా కొత్తగా ఏం ప్రశ్నలడిగినా విద్యార్థులు నీళ్లునమలడంపై ఉషాకుమారి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనుమానం వచ్చి లోతుగా ఆరా తీస్తే డొంకంతా కదిలింది. కేవలం జగన్ ప్రభుత్వానికి (Jagan Government) ప్రచారం కల్పించడం కోసమే ఇక్కడ ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల్లో కొందరికి అమెరికా ఇంగ్లీష్‌లో గతేడాది నుంచి శిక్షణ ఇచ్చినట్టు గుర్తించారు.

జగన్ ప్రభుత్వం సర్కార్ బడుల్లో ఆంగ్లమాధ్యమాన్ని (English medium) ప్రోత్సహించడానికి ‘‘టర్నింగ్ ఇంటర్మెంట్’’ కార్యక్రమాన్ని (Turning Interment Programe) నిర్వహించింది. దీని వల్లే విద్యార్థులు అమెరికా ఇంగ్లీష్ ఉచ్ఛరణలో ఘనత సాధించారని విద్యాశాఖ అధికారులు (Education officials) విపరీతంగా ప్రచారం చేశారు. దీనికి తోడు పాఠశాల ఉపాధ్యాయుడు జీవీఎం ప్రసాద్ (Prasad sir) ప్రత్యేక చొరవతో అమెరికా విద్యార్థులతో ఇక్కడి విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాస్‌లు ఏర్పాటు చేసి వీరి ఆంగ్ల ప్రావిణ్యాన్ని రాటు తేల్చారని గొప్పలు చెప్పారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మారుమూల పాఠశాల విద్యార్థులు అద్భుతంగా అమెరికా ఆంగ్లం మాట్లాడుతున్నారని ఉత్తుత్తి ప్రచారం చేశారు. ప్రత్యేక శిక్షణ ద్వారా వీరు అమెరికా ఇంగ్లీష్ మాట్లాడటంలో ఆరితేరిపోయారని ఇక్కడ పాఠశాల అధ్యాపకులు ప్రచారం చేసుకున్నారు. జగన్ సర్కార్ ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వల్లనే వీరంతా అమెరికా ఇంగ్లీష్‌లో ఆరితేరిపోయారని విద్యాశాఖ కూడా డబ్బా కొట్టుకుంది. అయితే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉషాకుమారి పర్యటనలో ఇదంతా బట్టిదే అని తేలిపోయింది. సీఎం పర్యటనలో ఎవరో కొద్దిమందితో బట్టీ పట్టించి ఆంగ్లంతో అధికారులు మమ అనిపించినట్లు తేలిపోయింది

Updated Date - 2023-02-27T00:10:07+05:30 IST