Viral Video: రైలు దిగుతుండగా డోరు మధ్యలో చిక్కుకున్న యువతి డ్రెస్.. రైలు ఆపాలని ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో..

ABN , First Publish Date - 2022-12-31T20:44:31+05:30 IST

రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. తొందరగా గమ్యస్థానం చేరాలనే ఆత్రుతతో కొందరు రన్నింగ్ ట్రైన్లను ఎక్కడం, దిగడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. అలాగే ..

Viral Video: రైలు దిగుతుండగా డోరు మధ్యలో చిక్కుకున్న యువతి డ్రెస్.. రైలు ఆపాలని ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో..

రైలు ప్రయాణ సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. తొందరగా గమ్యస్థానం చేరాలనే ఆత్రుతతో కొందరు రన్నింగ్ ట్రైన్లను ఎక్కడం, దిగడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. అలాగే మరికొందరు రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రమాదాల బారిన పడుతుంటారు. కొన్నిసార్లు అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. ముంబైలో ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువతి (young woman) మెట్రో రైలు దిగుతుండగా.. డ్రెస్ డోరు మధ్యలో చిక్కుకుపోయింది. రైలు ఆపాలని కొందరు ప్రయత్నించినా వీలు కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

తమ ఊరి బాలికను మరో వ్యక్తి కలవడం నచ్చని యువకులు.. అర్ధరాత్రి ప్రేమికులు ఇంట్లో ఉండగా.. అక్కడికి వెళ్లి..

ముంబైలోని (Mumbai) చాకల రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 21న ఈ ఘటన జరగ్గా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Viral videos) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి మెట్రో రైలు దిగే క్రమంలో పొరపాటున డోరు సందులో డ్రెస్ చిక్కుకుంటుంది. ఆటోమేటిక్ డోర్లు కావడంతో తెరవడానికి వీలు లేకుండా పోతుంది. డ్రెస్‌ను పదే పదే లాగేందుకు ప్రయత్నించినా సాధ్యం కాదు. ఆమె పరిస్థితిని గమనించిన ఓ వ్యక్తి ఇంజిన్ ముందుకు వెళ్లి డ్రైవర్‌ను హెచ్చరిస్తాడు. కానీ అప్పటికే రైలు కదలడం ప్రారంభిస్తుంది.

భార్య ఎదుటే కూతురి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన భర్త.. బయట ఎవరికీ చెప్పొద్దని బెదిరించి.. చివరకు..

చూస్తుండగానే వేగం పుంజుకుంటుంది. అంతలో మరో వ్యక్తి అక్కడికి వచ్చి, ఆమెను పక్కకు లాగేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అప్పటికే రైలు వేగంగా వెళ్తుండడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. యువతిని రైలు చాలా దూరం ఈడ్చుకెళుతుంది. చివరకు రైల్వే సిబ్బంది ఎలాగోలా రైలును ఆపేస్తారు. ఈ ప్రమాదంలో సదరు యువతి తీవ్రంగా గాయపడింది. రైల్వే సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలిస్తారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది.

Viral Video: కోబ్రాపై తుపాకీతో కాల్పులు జరిపిన యువకులు.. పారిపోవాల్సిన పాము చివరికి ఏం చేసిందంటే..

Updated Date - 2022-12-31T20:44:48+05:30 IST