నర్సును ప్రేమించిన వార్డు బాయ్.. ప్రియురాలు చెప్పిన మాటతో వైద్యురాలి వద్దకు వెళ్లి..

ABN , First Publish Date - 2022-12-30T21:21:04+05:30 IST

అతడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే పని చేస్తున్న ఓ నర్సుతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఇలావుండగా, ఇటీవల ఆస్పత్రిలో..

నర్సును ప్రేమించిన వార్డు బాయ్.. ప్రియురాలు చెప్పిన మాటతో వైద్యురాలి వద్దకు వెళ్లి..

అతడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే పని చేస్తున్న ఓ నర్సుతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఇలావుండగా, ఇటీవల ఆస్పత్రిలో ప్రియురాలికి అవమానం జరగడంతో ఓ వైద్యురాలిపై కోపం పెంచుకున్నాడు. ఇటీవల ఓ రోజు ఆమె వద్దకు వెళ్లి.. ఎవరూ ఊహించని విధంగా దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..

Viral Video: స్టేషన్ రాకముందే బోగీ డోరు వద్ద నిల్చున్న మహిళ.. సడన్‌గా పైకి వచ్చిన యువకుడు..

మహారాష్ట్ర (Maharashtra) నాసిక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన అనికేత్ అనే యువకుడు.. ఆస్పత్రిలో వార్డు బాయ్‌గా పని చేస్తున్నాడు. అతడికి ఇదే ఆస్పత్రిలో ఓ నర్సుతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య ప్రేమాయణం (love) మొదలైంది. ఇదిలావుండగా, ఇటీవల అనికేత్ ప్రియురాలు విధుల్లో ఉండగా.. ఏదో విషయమై మహిళా వైద్యురాలు (female doctor) మందలించింది. దీన్ని అవమానంగా భావించిన నర్సు.. ఇదే విషయాన్ని తన ప్రియుడితో చెప్పింది. అప్పటి నుంచి అనికేత్.. మహిళా వైద్యురాలిపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. సమయం కోసం వేచి చూస్తూ ఉండేవాడు. ఆదివారం రాత్రి మహిళా వైద్యురాలు.. కొందరు నర్సులతో మాట్లాడుతూ ఉండగా సడన్‌గా అక్కడికి వెళ్లాడు.

viral-videos.jpg

తమ ఊరి బాలికను మరో వ్యక్తి కలవడం నచ్చని యువకులు.. అర్ధరాత్రి ప్రేమికులు ఇంట్లో ఉండగా.. అక్కడికి వెళ్లి..

ఆపరేషన్ చేసే సమయంలో ఉపయోగించే కత్తెర తీసుకుని, ఆమెపై దాడికి (Assault with scissor) పాల్పడ్డాడు. గొంతు, కడుపు భాగంలో పొడవడంతో వైద్యురాలు తీవ్రంగా గాయపడింది. పక్కన ఉన్న నర్సులు వైద్యురాలిని పక్కకు లాగడంతో పాటూ యువకుడిని వారించడంతో.. తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. వైద్యురాలిపై దాడికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్ (Viral videos and photos) అవుతున్నాయి. నాసిక్‌లో డిసెంబర్‌ 14న ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ కంటి వైద్యురాలిపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాది చేశారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు.

Viral Video: కోబ్రాపై తుపాకీతో కాల్పులు జరిపిన యువకులు.. పారిపోవాల్సిన పాము చివరికి ఏం చేసిందంటే..

Updated Date - 2022-12-30T21:21:29+05:30 IST