Viral Video: స్టేషన్ రాకముందే బోగీ డోరు వద్ద నిల్చున్న మహిళ.. సడన్‌గా పైకి వచ్చిన యువకుడు..

ABN , First Publish Date - 2022-12-30T18:59:29+05:30 IST

రైలు ప్రయాణ సమయాల్లో ప్రయాణికులు సీటు కోసం ఎంత తాపత్రయపడతారో.. అలాగే స్టేషన్ రాకముందే డోర్ వద్దకు వెళ్లేందుకూ అంతే తాపత్రయ పడుతుంటారు. ఇది సర్వసాధారణంగా జరిగే తంతే అయినా.. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు..

Viral Video: స్టేషన్ రాకముందే బోగీ డోరు వద్ద నిల్చున్న మహిళ.. సడన్‌గా పైకి వచ్చిన యువకుడు..

రైలు ప్రయాణ సమయాల్లో ప్రయాణికులు సీటు కోసం ఎంత తాపత్రయపడతారో.. అలాగే స్టేషన్ రాకముందే డోర్ వద్దకు వెళ్లేందుకూ అంతే తాపత్రయ పడుతుంటారు. ఇది సర్వసాధారణంగా జరిగే తంతే అయినా.. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు అనేక షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. రైలు ఆగకముందే దిగే క్రమంలో కొన్నిసార్లు ప్రమాదాలు జరగడం.. చాలా సార్లు చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో బోగీ డోర్ వద్ద నిల్చుని ఉన్న మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. స్టేషన్ రాకముందే ద్వారం వద్దకు వచ్చిన మహిళ నిల్చుని వేచి చూస్తూ ఉంది. అయితే రైలు ఆగకముందే ఓ యువకుడు సడన్‌గా లోపలికి వచ్చి సదరు మహిళకు షాక్ ఇచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది.

తమ ఊరి బాలికను మరో వ్యక్తి కలవడం నచ్చని యువకులు.. అర్ధరాత్రి ప్రేమికులు ఇంట్లో ఉండగా.. అక్కడికి వెళ్లి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral videos) తెగ చక్కర్లు కొడుతోంది. స్టేషన్ వద్దకు రైలు (train) చేరుకోకముందే.. ఓ మహిళ డోరు వద్దకు వచ్చి నిలబడి ఉంటుంది. ఆమె పక్కనే ఓ వృద్ధుడు కూడా నిలబడి ఉంటాడు. స్టేషన్ దగ్గర పడడంతో రైలు నిదానంగా వెళ్తుంటుంది. బయట అంతా చీకటిగా ఉంటుంది. ఆ సమయంలో సడన్‌గా షాకింగ్ ఘటన (Shocking incident) చోటు చేసుకుంటుంది. ఓ యువకుడు సడన్‍‌గా బోగీలోకి వచ్చి.. అంతే వేగంగా మహిళ చేతిలో ఉన్న పర్సును లాక్కుని (theft) దిగిపోతాడు. ఊహించని ఈ పరిణామానికి మహిళతో పాటూ పక్కన ఉన్న వృద్ధుడు కూడా షాక్ అవుతాడు. దొంగ పర్సును లాక్కోగానే మహిళ రైలు దిగేందుకు ప్రయత్నిస్తుంది. అయితే పక్కన ఉన్న వృద్ధుడు ఆమెను పట్టుకుని లోపలికి లాగి ప్రాణాలు కాపాడతాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. స్టేషన్ రాకముందే ఇలాంటి తొందరపాటు పనికిరాదు.. అంటూ కొందరు, బోగీలకు ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేయాలంటూ మరికొందరు సూచిస్తున్నారు.

మూడో భర్త వీడియో కాల్ చేయగా.. రెండో భర్తతో కలిసి మాట్లాడిన మహిళ.. రాత్రి ఇద్దరూ మద్యం సేవించిన అనంతరం..

Updated Date - 2022-12-30T18:59:58+05:30 IST

Read more