ప్రేయసిని కలవడానికి కళాశాల వద్దకు వెళ్లిన యువకుడు.. మాటల మధ్యలో అతడు చేసిన పనికి..

ABN , First Publish Date - 2022-11-22T19:55:08+05:30 IST

కలకాలం కలిసి ఉండాలని ప్రేమికులు అనుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అనుకోని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ కారణంగా వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్లకుండా మధ్యలోనే ముగుస్తుంటుంది. కొన్నిసార్లు పెళ్లి విషయంలో..

ప్రేయసిని కలవడానికి కళాశాల వద్దకు వెళ్లిన యువకుడు.. మాటల మధ్యలో అతడు చేసిన పనికి..

కలకాలం కలిసి ఉండాలని ప్రేమికులు అనుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అనుకోని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ కారణంగా వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్లకుండా మధ్యలోనే ముగుస్తుంటుంది. కొన్నిసార్లు పెళ్లి విషయంలో ప్రేమికుల మధ్య గొడవలు చోటు చేసుకుంటుంటాయి. మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రేయసిని కలిసేందుకు ఓ యువకుడు కళాశాల వద్దకు వెళ్లాడు. మాటల మధ్యలో ఒక్కసారిగా అతడు చేసిన పనికి... స్థానికులంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

నిశ్చితార్థం పెట్టుకుని ఒక రోజు ముందు కాలేజీకి వెళ్లిన యువతి.. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో.. చివరకు..

మహారాష్ట్ర (Maharashtra) ఔరంగాబాద్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన గజానన్ అనే యువకుడికి కొన్ని నెలల క్రితం పూజ అనే యువతి పరిచయమైంది. ఈమె స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో జువాలజీలో పీహెచ్‌డీ చేస్తోంది. ఇటీవల గజానన్, పూజ తరచూ కలుస్తుండేవారు. కొన్నాళ్లకు వీరి పరిచయం కాస్త.. ప్రేమగా (love) మారింది. ఇద్దరూ కలిసి జీవితాంతం కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు చాలా డబ్బులు ఖర్చు చేశాడు. అయితే ఇటీవల గజానన్ యువతి వద్ద పెళ్లి (marriage) ప్రస్తావన తెచ్చాడు. అయితే ఇందుకు పూజ ఒప్పుకోలేదు. అయినా తననే పెళ్లిచేసుకోవాలంటూ రోజూ గొడవ చేసేవాడు.

పైకెళ్లి మాట్లాడుకుందామంటూ బాలికను తీసుకెళ్లిన స్వీపర్.. కాసేపటి తర్వాత ఎవరికీ చెప్పొద్దంటూ..

ఇలా కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం పూజ.. కళాశాల వద్ద ఉండగా వెళ్లి కలిశాడు. మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చి.. గొడవ చేశాడు. అయినా ఒప్పుకోకపోవడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ని తనపై పోసుకుని, ప్రేయసిపై కూడా పోశాడు. తర్వాత నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటలను ఆర్పేసి, వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే గజనాన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువతి ప్రస్తుతం 50శాత కాలిన గాయాలతో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

స్నేహితులతో కలిసి కొండల్లో మందు పార్టీ చేసుకున్న భర్త.. భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ..

Updated Date - 2022-11-22T19:55:08+05:30 IST

Read more