పైకెళ్లి మాట్లాడుకుందామంటూ బాలికను తీసుకెళ్లిన స్వీపర్.. కాసేపటి తర్వాత ఎవరికీ చెప్పొద్దంటూ..

ABN , First Publish Date - 2022-11-22T18:25:49+05:30 IST

అభం శుభం తెలియని బాలికలను కూడా కొందరు వక్రదృష్టితో చూస్తుంటారు. కొందరు కామాంధులు చేసే పనులు సభ్యసమాజం తల దించుకునేవిధంగా ఉంటాయి. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, రాజస్థాన్‌లో.

పైకెళ్లి మాట్లాడుకుందామంటూ బాలికను తీసుకెళ్లిన స్వీపర్.. కాసేపటి తర్వాత ఎవరికీ చెప్పొద్దంటూ..
ప్రతీకాత్మక చిత్రం

అభం శుభం తెలియని బాలికలను కూడా కొందరు వక్రదృష్టితో చూస్తుంటారు. కొందరు కామాంధులు చేసే పనులు సభ్యసమాజం తల దించుకునేవిధంగా ఉంటాయి. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, రాజస్థాన్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో స్వీపర్‍‌గా పని చేసే వ్యక్తి.. ఓ బాలికపై కన్నేశాడు. ఓ రోజు పైకెళ్లి మాట్లాడుకుందామంటూ పైకి తీసుకెళ్లాడు. మాటల మధ్యలో ఎవరికి చెప్పొద్దంటూ అతడు చేసిన పని.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..

నట్టింట్లో గుంత ఏంటని అడిగితే ఆమెలో కంగారు.. అనుమానం వచ్చి దాన్ని తవ్వి చూస్తే..!

రాజస్థాన్ (Rajasthan) జైపూర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 32ఏళ్ల ఓ వ్యక్తి.. ఓ అపార్ట్‌మెంట్‌లో స్వీపర్‌గా పని చేస్తున్నాడు. మంచిగా పని చేసుకున్నట్లు అందరినీ నమ్మిస్తూ.. నిత్యం యువకులు, బాలికలను టార్గెట్ చేసేవాడు. ఇదిలావుండగా, సోమవారం అతడు పనిలో ఉండగా.. అపార్ట్‌మెంట్‌కి చెందిన ఓ ఎనిమిదేళ్ల బాలిక (girl) ఒక్కటే ఆడుకుంటూ కనిపించింది. ఆమె వద్దకు వెళ్లి కొద్దిసేపు మాటల్లో పెట్టాడు. తర్వాత పైకి వెళ్లి మాట్లాడుకుందాం.. 7వ అంతస్తులోని టెర్రస్ పైకి తీసుకెళ్లాడు.

నిశ్చితార్థం పెట్టుకుని ఒక రోజు ముందు కాలేజీకి వెళ్లిన యువతి.. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో.. చివరకు..

అక్కడికి వెళ్లాక మాటల మధ్యలో ఆమె పట్ల అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు. వద్దు అని బాలిక వేడకుంటున్నా వినకుండా తన పైశాసికాన్ని ప్రదర్శించాడు. తర్వాత బయట ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఇంటికి వెళ్లిన బాలిక ఏడుస్తూ కనిపించడంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో జరిగిన విషయం తెలియజేసింది. బాలిక కుటంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

స్నేహితులతో కలిసి కొండల్లో మందు పార్టీ చేసుకున్న భర్త.. భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ..

Updated Date - 2022-11-22T18:25:49+05:30 IST

Read more