స్నేహితులతో కలిసి కొండల్లో మందు పార్టీ చేసుకున్న భర్త.. భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ..

ABN , First Publish Date - 2022-11-22T17:34:51+05:30 IST

అతను విహారయాత్ర నిమిత్తం స్నేహితులతో కలిసి ఆరావళి కొండల్లోకి వెళ్లాడు. సుమారు 200అడుగుల ఎత్తులో అంతా కలిసి సరదాగా మందు తాగి పార్టీ చేసుకున్నారు. కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత.. భార్యకు వీడియో కాల్ చేశాడు. తన చుట్టూ ఉన్న..

స్నేహితులతో కలిసి కొండల్లో మందు పార్టీ చేసుకున్న భర్త.. భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ..
ప్రతీకాత్మక చిత్రం

అతను విహారయాత్ర నిమిత్తం స్నేహితులతో కలిసి ఆరావళి కొండల్లోకి వెళ్లాడు. సుమారు 200అడుగుల ఎత్తులో అంతా కలిసి సరదాగా మందు తాగి పార్టీ చేసుకున్నారు. కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత.. భార్యకు వీడియో కాల్ చేశాడు. తన చుట్టూ ఉన్న పరిసరాలను ఆమెకు చూపిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో భార్య చూస్తుండగానే అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆమె షాక్ అయ్యి.. పోలీసులకు సమాచారం అందించింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

నట్టింట్లో గుంత ఏంటని అడిగితే ఆమెలో కంగారు.. అనుమానం వచ్చి దాన్ని తవ్వి చూస్తే..!

హర్యానాలోని (Haryana) ఫరీదాబాద్ జిల్లా ఆరావళి కొండల్లో (Aravalli mountains) బల్లభఘర్‌ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన కమల్(40) అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫరీదాబాద్‌లోని ఓ ప్రైవేట్ టెక్స్‌టైల్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇదిలావుండగా, ఇటీవల కమల్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం.. బల్లభఘర్‌ ప్రాంతంలోని ఆరావళి కొండల్లోకి వెళ్లాడు. సుమారు 200అడుగుల ఎత్తులో స్నేహితులతో కలిసి మందు తాగి పార్టీ చేసుకున్నారు.

అత్త నిద్రిస్తుండగా ఇంట్లోకి వెళ్లిన యువకుడు.. చప్పుడు చేయకుండా ఆమె కళ్లు, పెదవులపై పెవిక్విక్ వేసి మరీ..

accident.jpg

తర్వాత తన భార్యకు వీడియో కాల్ (video call) చేసి, చుట్టు పక్కల ప్రాంతాలను చూపిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో అతడు కొండ అంచు భాగానికి వెళ్లాడు. భార్యతో మాట్లాడుతుండగానే.. ఉన్నట్టుండి బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయాడు. ఇదంతా భార్య చూస్తుండగానే జరిగింది. దీంతో ఆమె కంగారుపడి పోలీసులకు సమాచారం అందించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు మూడు గంటల పాటు శ్రమించి, మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిశ్చితార్థం పెట్టుకుని ఒక రోజు ముందు కాలేజీకి వెళ్లిన యువతి.. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో.. చివరకు..

Updated Date - 2022-11-22T17:35:28+05:30 IST

Read more