నట్టింట్లో గుంత ఏంటని అడిగితే ఆమెలో కంగారు.. అనుమానం వచ్చి దాన్ని తవ్వి చూస్తే..!

ABN , First Publish Date - 2022-11-22T15:42:44+05:30 IST

దంపతుల మధ్య తలెత్తే చిన్న చిన్న సమస్యలు.. కొన్నిసార్లు చాలా పెద్ద గొడవలుగా మారిపోతుంటాయి. కొందరు అదే కోపాన్ని మనసులో పెట్టుకుని చివరకు దారుణాలకు తెగబడుతుంటారు. బీహార్‌లో ..

నట్టింట్లో గుంత ఏంటని అడిగితే ఆమెలో కంగారు.. అనుమానం వచ్చి దాన్ని తవ్వి చూస్తే..!

దంపతుల మధ్య తలెత్తే చిన్న చిన్న సమస్యలు.. కొన్నిసార్లు చాలా పెద్ద గొడవలుగా మారిపోతుంటాయి. కొందరు అదే కోపాన్ని మనసులో పెట్టుకుని చివరకు దారుణాలకు తెగబడుతుంటారు. బీహార్‌లో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నట్టింట్లో గుంత ఏంటని బంధువులంతా.. మహిళను ప్రశ్నించారు. దీంతో ఆమెలో ఒక్కసారిగా కంగారు మొదలైంది. చివరకు గుంత తవ్వి చూసి అంతా షాక్ అయ్యారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...

నిశ్చితార్థం పెట్టుకుని ఒక రోజు ముందు కాలేజీకి వెళ్లిన యువతి.. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో.. చివరకు..

బీహార్ (Bihar) ముజఫర్‌పూర్ పరిధి బోచాహాలో ఈ ఘటన చోటు చేసుకుంది. విభ అనే మహిళకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల విభ, ఆమె భర్త మధ్య గొడవలు జరుగున్నాయి. దీనికి తోడు ఆర్థిక సమస్యలు (Financial problems) కూడా పెరిగిపోయాయి. దీంతో ఇటీవల ఆ గొడవలు కాస్తా.. ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో 15రోజులుగా భర్త.. విభ సోదరుడి ఇంట్లో ఉంటున్నాడు. ఇది విభకు మరింత కోపాన్ని తెప్పించింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మూడు సంవత్సరాల తన మేనల్లుడు నితిక్.. విభ ఇంట్లోకి వచ్చాడు. అప్పటికే భర్తపై విపరీతమైన కోపంతో ఉన్న ఆమె.. ఆ కోపాన్నంతా చిన్నారిపై చూపించింది. బాలుడి గొంతు నులిమి హత్య చేసి, నోట్లో ఇటుక రాళ్లు.. మట్టితో నింపింది.

అత్త నిద్రిస్తుండగా ఇంట్లోకి వెళ్లిన యువకుడు.. చప్పుడు చేయకుండా ఆమె కళ్లు, పెదవులపై పెవిక్విక్ వేసి మరీ..

chaild.jpg

అనంతరం కేసు తన మీదకు రాకుండా ఉండేందుకు.. మృతదేహాన్ని (dead body) ఇంట్లో గొయ్యి తవ్వి పూడ్చిపెట్టింది. తమ కుమారుడు కనిపించకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికిన తల్లిదండ్రులు.. చివరకు విభ ఇంటికి వచ్చారు. చిన్నారి గురించి అడగ్గా.. తనకేమీ తెలీదని బుకాయించింది. చివరకు ఇంట్లో గొయ్యి చూసి.. ఇదేంటని ప్రశ్నించారు. ఎలుకలు తవ్వాయని చెప్పినా వారికి అనుమానం కలిగింది. చివరకు కొంత మట్టి తీయగా చిన్నారి కాలు కనిపించింది. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితురాలిని అరెస్ట్ చేశారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

మహిళ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయంటూ పోలీసులకు ఫోన్.. ఆరు నిముషాల్లో వారు చేసిన పని..

Updated Date - 2022-11-22T15:44:29+05:30 IST

Read more