అత్త నిద్రిస్తుండగా ఇంట్లోకి వెళ్లిన యువకుడు.. చప్పుడు చేయకుండా ఆమె కళ్లు, పెదవులపై పెవిక్విక్ వేసి మరీ..

ABN , First Publish Date - 2022-11-20T18:13:32+05:30 IST

ప్రస్తుతం చాలా మంది యువకుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. వయసు, వరుసలు మరిచి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడడం సర్వసాధారణమైంది. ప్రేమ పేరుతో వేధించడం, తమ దారికి రాని వారిపై దారుణాలకు పాల్పడడం ఎక్కువైపోతోంది. రాజస్థాన్‌లో..

అత్త నిద్రిస్తుండగా ఇంట్లోకి వెళ్లిన యువకుడు.. చప్పుడు చేయకుండా ఆమె కళ్లు, పెదవులపై పెవిక్విక్ వేసి మరీ..
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం చాలా మంది యువకుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. వయసు, వరుసలు మరిచి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడడం సర్వసాధారణమైంది. ప్రేమ పేరుతో వేధించడం, తమ దారికి రాని వారిపై దారుణాలకు పాల్పడడం ఎక్కువైపోతోంది. రాజస్థాన్‌లో ఓ మహిళ విషయంలో ఇలాగే జరిగింది. వరుసకు మేనల్లుడు అయిన యువకుడు.. అత్తపై కన్నేశాడు. ఓ రోజు ఆమె నిద్రిస్తుండగా.. ఆమె కళ్లు, పెదవులపై పెవిక్విక్ వేసి మరీ దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..

ఒంటరిగా ఉన్న సమయంలో మరదలి వద్దకు వెళ్లాడు.. ఊహించని విధంగా ఆమె చేసిన పనితో.. కాసేపటికి..

రాజస్థాన్‌లోని (Rajasthan) భరత్‌పూర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 32ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. ఆమెకు వరసకు మేనల్లుడు అయ్యే యువకుడు తరచూ ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అతడు అత్తపై కన్నేశాడు. అప్పుడప్పుడూ ఆమెను తాకరానిచోట తాకుతూ (Indecent behavior) ఉండేవాడు. మొదట్లో ఆమె పట్టించుకోలేదు.. అయితే తరచూ అదే విధంగా ప్రవర్తించడడంతో ఓ రోజు గట్టిగా మందలించింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను తనదారికి తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. చివరకు నవంబర్ 17న రాత్రి అత్త ఇంట్లోకి వెళ్లాడు. నిద్రపోతున్న ఆమె కళ్లు, పెదవులపై పెవిక్విక్ వేశాడు.

ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో.. 10 నెలల పాటు పోలీసుల సెర్చ్ ఆపరేషన్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

crime.jpg

అనంతరం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన ఆమె.. అతన్ని గట్టిగా పక్కకు తోసేసింది. పెదవులు అతుక్కుపోవడంతో కేకలు పెట్టేందుకు సాధ్యం కాలేదు. కళ్లు కూడా తెరవలేని పరిస్థితి నెలకొంది. చివరకు ఎలాగోలా అతడి నుంచి విడిపించుకుని, బలవంతంగా పెదవులు తెరచి.. గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకోవడంతో యువకుడు పరారయ్యాడు. ఈ క్రమంలో పెవిక్విక్ (Fevikwik), స్క్రూడైవర్ అక్కడే పడిపోయాయి. తర్వాత మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కళ్లలో పెవిక్విక్ ఎక్కువగా వేయడంతో కుడి కన్ను చూపు చాలా తగ్గిపోయే ప్రమాదం ఉండొచ్చని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

మహిళ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయంటూ పోలీసులకు ఫోన్.. ఆరు నిముషాల్లో వారు చేసిన పని..

Updated Date - 2022-11-20T18:19:14+05:30 IST