ఒంటరిగా ఉన్న సమయంలో మరదలి వద్దకు వెళ్లాడు.. ఊహించని విధంగా ఆమె చేసిన పనితో.. కాసేపటికి..

ABN , First Publish Date - 2022-11-19T20:23:55+05:30 IST

కొందరు ప్రబుద్ధులు.. బాలికలు, యువతులు అనే తేడా లేకుండా అందరినీ వక్ర దృష్టితో చూస్తుంటారు. అవకాశం దొరికితే అసభ్యకరంగా ప్రవర్తించాలని చూస్తుంటారు. ఈ క్రమంలో మాయమాటలు చెబుతూ నమ్మించడం, చివరికి..

ఒంటరిగా ఉన్న సమయంలో మరదలి వద్దకు వెళ్లాడు.. ఊహించని విధంగా ఆమె చేసిన పనితో.. కాసేపటికి..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు ప్రబుద్ధులు.. బాలికలు, యువతులు అనే తేడా లేకుండా అందరినీ వక్ర దృష్టితో చూస్తుంటారు. అవకాశం దొరికితే అసభ్యకరంగా ప్రవర్తించాలని చూస్తుంటారు. ఈ క్రమంలో మాయమాటలు చెబుతూ నమ్మించడం, చివరికి మోసం చేయడమే పనిగా పెట్టుకుంటుంటారు. తమ దారికి రానివారిపై దాడులకు పాల్పడుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న సమయంలో మరదలి వద్దకు వెళ్లాడు. చివరకు ఆమె చేసిన పనికి.. కాసేపటికి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..

ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో.. 10 నెలల పాటు పోలీసుల సెర్చ్ ఆపరేషన్.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లలిత్‌పూర్ పరిధి మదౌన్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి రెండు నెలలుగా తన అత్తగారి ఊరైన మదౌన్ గ్రామంలో ఉంటున్నాడు. ఈ క్రమంలో నాగేంద్ర మరదలు అతడితో చనువుగా ఉండేది. బావే కావడంతో సరదాగా మాట్లాడుతూ ఉండేది. అయితే నాగేంద్ర మాత్రం ఆమెను వక్ర దృష్టితో చూసేవాడు. ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నించేవాడు. ఇలావుండగా, గురువారం కుటుంబ సభ్యులు అంతా పని మీద వేరే ఊరికి వెళ్లారు. ఆ సమయంలో నాగేంద్ర మరదలు ఒక్కటే ఇంట్లో ఉంది.

రోడ్డు పక్కన పడి ఉందో సూట్‌కేస్.. అనుమానంగానే ఓపెన్ చేసి చూసిన స్థానికులకు మైండ్‌బ్లాక్.. అందులో..

hospital.jpg

దీంతో అతడు తన మనసులోని మాటలను బయటపెట్టాడు. నువ్వంటే ఇష్టం అంటూ మరదలి పట్ల అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అతను.. కత్తితో మరదలి గొంతు కోసి, అక్కడి నుంచి పరారయ్యాడు. నేరుగా సమీపంలోని రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లాడు. ఎవరూ లేని సమయం చూసి రైలు కింద పడి ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన యువతిని.. బంధువులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.

నాకీ పెళ్లొద్దంటూ వరుడు గొడవ.. అమ్మాయి తల్లిదండ్రులు నిలదీస్తే అతడు చెప్పిన కారణం విని.

Updated Date - 2022-11-19T21:12:22+05:30 IST

Read more