రోడ్డు పక్కన పడి ఉందో సూట్‌కేస్.. అనుమానంగానే ఓపెన్ చేసి చూసిన స్థానికులకు మైండ్‌బ్లాక్.. అందులో..

ABN , First Publish Date - 2022-11-19T15:59:24+05:30 IST

అనుమానాస్పద వస్తువులు బయపడిన సందర్భాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రద్దీగా ఉన్న రోడ్డు పక్కన ఓ సూట్‌కేస్ అనుమానాస్పదంగా పడి ఉంది. అటుగా వెళ్తున్న స్థానికులు..

రోడ్డు పక్కన పడి ఉందో సూట్‌కేస్.. అనుమానంగానే ఓపెన్ చేసి చూసిన స్థానికులకు మైండ్‌బ్లాక్.. అందులో..
ప్రతీకాత్మక చిత్రం

అనుమానాస్పద వస్తువులు బయపడిన సందర్భాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రద్దీగా ఉన్న రోడ్డు పక్కన ఓ సూట్‌కేస్ అనుమానాస్పదంగా పడి ఉంది. అటుగా వెళ్తున్న స్థానికులు దాన్ని గమనించారు. దీంతో అనుమానంగానే అక్కడికి వెళ్లి ఓపెన్ చేశారు. అయితే సూట్‌కేస్ తెరవగానే వారికి మైండ్ బ్లాక్ అయినంత పనైంది.

Bachelors Village: ఆ ఊళ్లో మగాళ్లకు వింత సమస్య.. 40 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు అవకపోవడం వెనుక..!

girl.jpg

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) మధుర పరిధి రాయ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై మథుర టోల్‌కు 13 కిలోమీటర్ల దూరంలో.. ఆగ్రా వైపు 20 మీటర్ల దూరంలో సర్వీస్ రోడ్డుపై ఓ సూట్‌కేస్ కలకలం సృష్టించింది. అటుగా వెళ్తున్న స్థానికులు సూట్‌కేస్ కనిపించింది. దీంతో అనుమానంగానే దాని దగ్గరికి వెళ్లి భయం భయంగా ఓపెన్ చేశారు. అయితే అందులో యువతి మృతదేహం (young woman dead body) ఉండడం చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహం పరిశీలించారు. గుర్తు తెలియని దుండగులు మృతదేహాన్ని పాలిథిన్ కవర్లో చుట్టి, సూట్‌కేస్‌లో కుక్కి పడేసి వెళ్లినట్లు తెలిసింది. ఛాతీపై బుల్లెట్ గాయం ఉన్నట్లు గుర్తించారు. ఎవరో యువతిని అతి సమీపం నుంచి కాల్చి చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

దోపిడీ దొంగల వెరైటీ రూటు.. సెంటిమెంట్ డైలాగ్స్‌తో బ్యాంకు ఉద్యోగులను కదలకుండా చేసి మరీ..!

young-women.jpg

ఎక్కడో హత్య చేసి, గుర్తు పట్టకుండా ఉండేందుకు ఈ ప్రాంతంలో పడేసి వెళ్లినట్లు తెలిసింది. చుట్టు పక్కల ప్రాంతాల్లో తప్పిపోయిన యువతుల గురించి ఆరా తీస్తున్నారు. మరోవైపు సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలిస్తున్నారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలూ లభించలేదని పోలీసులు తెలిపారు. బంధువుల రాక కోసం మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలో భద్రపరిచారు. యువతి ఎత్తు సుమారు 5అడుగుల రెండు అంగుళాలు ఉంటుందన్నారు. బ్లాక్ హెయిర్ గ్రే కలర్ టీషర్ట్ వేసుకుందని, ఎడమ చేతికి నల్లదారం కూడా కట్టి ఉందని చెప్పారు. దుండగులు సాక్ష్యాలు దొరక్కుండా పక్కా పథకం ప్రకారం హత్య చేశారని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.

నాకీ పెళ్లొద్దంటూ వరుడు గొడవ.. అమ్మాయి తల్లిదండ్రులు నిలదీస్తే అతడు చెప్పిన కారణం విని..

Updated Date - 2022-11-19T16:08:40+05:30 IST