నిశ్చితార్థం పెట్టుకుని ఒక రోజు ముందు కాలేజీకి వెళ్లిన యువతి.. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో.. చివరకు..

ABN , First Publish Date - 2022-11-20T21:03:37+05:30 IST

తమ కూతురుకి ఘనంగా వివాహం చేయాలని ఆ తల్లిదండ్రుల కోరిక. అందుకు తగ్గట్లుగానే మంచి సంబంధం చూసి, నిశ్చితార్థం ఫిక్స్ చేసుకున్నారు. కార్యక్రమానికి బంధువులు, సన్నిహితులకు ఆహ్వానం అందించారు. నిశ్చితార్థం కార్యక్రమాన్ని కూడా..

నిశ్చితార్థం పెట్టుకుని ఒక రోజు ముందు కాలేజీకి వెళ్లిన యువతి.. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం

తమ కూతురుకి ఘనంగా వివాహం చేయాలని ఆ తల్లిదండ్రుల కోరిక. అందుకు తగ్గట్లుగానే మంచి సంబంధం చూసి, నిశ్చితార్థం ఫిక్స్ చేసుకున్నారు. కార్యక్రమానికి బంధువులు, సన్నిహితులకు ఆహ్వానం అందించారు. నిశ్చితార్థం కార్యక్రమాన్ని కూడా ఘనంగా చేయాలని నిర్ణయించున్నారు. ఒక రోజు తర్వాత కార్యక్రమం జరగాల్సి ఉండగా.. కళాశాలకు వెళ్లిన యువతి సాయంత్రం ఇంటికి రాలేదు. చివరకు విచారించగా షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

మహిళ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయంటూ పోలీసులకు ఫోన్.. ఆరు నిముషాల్లో వారు చేసిన పని..

చెన్నై (Chennai) అన్నానగర్ పరిధి కడలూర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుందరమూర్తి(65), సుమతి (50) దంపతులకు.. పుష్ప రోహిణి(19) అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం రోహిణి డిగ్రీ చదువుతోంది. ఇదిలావుండగా, ఇటీవల కూతురికి తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూశారు. ఆదివారం నిశ్చితార్థం (Engagement) చేసుకునేలా మాట్లాడుకున్నారు. బంధువులు, సన్నిహితులకు అందరికీ ఆహ్వానం అందించారు. అయితే శనివారం కళాశాలకు వెళ్లిన రోహిణి సాయంత్రం ఇంటికి రాలేదు.

ఒంటరిగా ఉన్న సమయంలో మరదలి వద్దకు వెళ్లాడు.. ఊహించని విధంగా ఆమె చేసిన పనితో.. కాసేపటికి..

దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. చివరకు విచారింగా వేలంగిపట్టు అనే ప్రాంతానికి చెందిన యువకుడితో వెళ్లిపోయిందని తెలిసింది. గత కొన్ని నెలలుగా యువతి అతడితో ప్రేమలో (love) ఉందని చెప్పారు. ఈ మాట విన్న యువతి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చివరకు పొలం వద్దకు వెళ్లి.. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

అత్త నిద్రిస్తుండగా ఇంట్లోకి వెళ్లిన యువకుడు.. చప్పుడు చేయకుండా ఆమె కళ్లు, పెదవులపై పెవిక్విక్ వేసి మరీ..

Updated Date - 2022-11-20T21:03:41+05:30 IST