వివాహానంతరం భర్తను దూరం పెట్టిన వధువు.. మూడో రోజు హనీమూన్‌లో భార్య ముసుగు తీసి చూడగా..

ABN , First Publish Date - 2022-11-16T18:17:36+05:30 IST

వారిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహం. బంధువులు, సన్నిహితుల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. వివాహానంతరం భార్యతో సరదగా హనీమూన్‌కు కూడా వెళ్లాడు. అయితే భార్య మాత్రం అతన్ని దగ్గరికి రానీయలేదు. అయినా..

వివాహానంతరం భర్తను దూరం పెట్టిన వధువు.. మూడో రోజు హనీమూన్‌లో భార్య ముసుగు తీసి చూడగా..
ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహం. బంధువులు, సన్నిహితుల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. వివాహానంతరం భార్యతో సరదగా హనీమూన్‌కు కూడా వెళ్లాడు. అయితే భార్య మాత్రం అతన్ని దగ్గరికి రానీయలేదు. అయినా భార్య మనసును అర్థం చేసుకుని.. రెండు రోజులు వేచిచూశాడు. అయినా మూడో రోజు కూడా భార్య అలాగే చేస్తుండడంతో బలవంతంగా ముసుగు తొలగించాడు. దీంతో అతడి మైండ్ బ్లాక్ అయింది. చివరకు భార్య చెప్పిన సమాధానం విని ఖంగుతిన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రేయసికి నిశ్చితార్థం జరుగుతోందని తెలుసుకున్న యువకుడు.. అర్థరాత్రి ప్రియురాలి తండ్రి, అన్న వద్దకు వెళ్లి..

యూపీలోని ఎటావా పరిధి ఠాణా జైత్ర యువకుడికి.. ఢిల్లీ శకర్‌పూర్ పరిధికి చెందిన యువతితో ఇటీవల వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన సంబంధం కావడంతో అంతకుముందు వధువు కుటుంబ సభ్యులతో వరుడి కుటుంబ సభ్యులకు ఎలాంటి పరిచయమూ లేదు. బంధువులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. అనంతరం వరుడు తన భార్యను సరదాగా హనీమూన్‌కి తీసుకెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లాక.. నవ వధువు ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. భర్త దగ్గరికి వెళ్లాలని ప్రయత్నించినా భార్య మాత్రం దూరం పెట్టేది. భార్య మనుసును అర్థం చేసుకున్న యువకుడు.. రెండు రోజుల పాటు ఆమెకు ఎలాంటి ఇబ్బందీ కలిగించలేదు.

అత్తమామల ఇంట్లో ఉన్న ప్రియురాలి వద్దకు అర్ధరాత్రి వెళ్లిన ప్రియుడు.. ఇద్దరూ గదిలో ఉండగా.. సడన్‌గా..

అయితే మూడో రోజు కూడా ఆమె ప్రవర్తన అలాగే ఉండడంతో అతడికి కోపం వచ్చింది. బలవంతంగా భార్య ముసుగును తొలగించి, ఎందుకిలా చేస్తున్నావ్.. అంటూ నిలదీశాడు. అయితే ఆమె మొఖంలో మార్పు చూసి షాక్ అయ్యాడు. తాను, తన కుటుంబ సభ్యులు కూడా ట్రాన్స్‌జెండర్స్ అని భార్య చెప్పిన మాటలు విని ఖంగుతిన్నాడు. ఈ షాక్‌తో ఐదు రోజుల పాటు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అయితే ఆరో రోజు భర్త గాఢనిద్రలో ఉండగా, భార్య కుటుంబ సభ్యులు.. ఇంట్లోని నగలు, డబ్బుతో ఉడాయించారు. దీంతో చివరకు తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్న కొడుకు.. తల్లికి ఎలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చాడో చూడండి..

Updated Date - 2022-11-16T18:18:27+05:30 IST