ప్రేయసికి నిశ్చితార్థం జరుగుతోందని తెలుసుకున్న యువకుడు.. అర్థరాత్రి ప్రియురాలి తండ్రి, అన్న వద్దకు వెళ్లి..

ABN , First Publish Date - 2022-11-16T15:53:09+05:30 IST

కొందరు అవతలి వ్యక్తి ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా.. తాము చెప్పినట్లుగా వినాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. ఈ క్రమంలో తమ దారికి రాని వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ప్రేమ విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. యూపీలో..

ప్రేయసికి నిశ్చితార్థం జరుగుతోందని తెలుసుకున్న యువకుడు.. అర్థరాత్రి ప్రియురాలి తండ్రి, అన్న వద్దకు వెళ్లి..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు అవతలి వ్యక్తి ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా.. తాము చెప్పినట్లుగా వినాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. ఈ క్రమంలో తమ దారికి రాని వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ప్రేమ విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. యూపీలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రేయసికి నిశ్చితార్థం జరుగుతోందని తెలుసుకున్న యువకుడు.. అర్ధరాత్రి ప్రియురాలి తండ్రి, అన్న వద్దకు వెళ్లాడు. చివరకు అతడు చేసిన దారుణం.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..

విమానం నుంచి కిందకు దూకిన సైనికుడు.. సడన్‌గా తెరచుకోని పారాచ్యూట్.. చివరకు ఏం జరిగిందంటే..

యూపీలోని (UP) బండా పరిధి బాబేరులోని నిభౌర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దేవ్‌లాల్ అనే వ్యక్తికి భార్య, రాజు అనే కొడుకు, ఓ కుమార్తె ఉన్నారు. దేవ్‌లాల్ వ్యసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలావుండగా, ఇటీవల స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువకుడు దేవ్‌లాల్ కుమార్తెను (love) ప్రేమిస్తున్నాడు. కానీ ఆ యువతికి మాత్రం అతడంటే ఇష్టం లేదు. అయినా యువకుడు మాత్రం ఆమెను ఫాలో అవుతూ ఉండేవాడు. ఇలావుండగా, ఇటీవల దేవ్‌లాల్ తన కుమార్తెకు పెళ్లి (marriage) సంబంధం ఫిక్స్ చేశాడు. బుధవారం నిశ్చితార్థం (Engagement) ఉండడంతో మంగళవారం పెళ్లి కుమారుడి గ్రామానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

అత్తమామల ఇంట్లో ఉన్న ప్రియురాలి వద్దకు అర్ధరాత్రి వెళ్లిన ప్రియుడు.. ఇద్దరూ గదిలో ఉండగా.. సడన్‌గా..

తనకు దక్కాల్సిన యువతి.. వేరే యువకుడికి భార్యగా వెళ్లడాన్ని స్థానిక యువకుడు జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న అతను.. ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం అర్ధరాత్రి దేవ్‌లాల్.. తన కుమారుడితో కలిసి పొలంలో కాపలాకు వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న యువకుడు.. కొందరు స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లాడు. తండ్రీకొడుకులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కొడుకు అక్కడికక్కడే మృతి చెందగా.. దేవ్‌లాల్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

Viral Video: కడుపులో ఏదో కదులుతోందని ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. చివరకు నోటి ద్వారా పరిశీలించి బయటికి తీయగా..

Updated Date - 2022-11-16T15:53:09+05:30 IST

Read more