అత్తమామల ఇంట్లో ఉన్న ప్రియురాలి వద్దకు అర్ధరాత్రి వెళ్లిన ప్రియుడు.. ఇద్దరూ గదిలో ఉండగా.. సడన్‌గా..

ABN , First Publish Date - 2022-11-15T21:18:55+05:30 IST

వారిద్దరికీ కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకే ఆ పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. ఇద్దరూ జీవితాంతం కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. అయితే అనూహ్యంగా ప్రియురాలిని వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయినా వారిద్దరూ ఎవరికీ తెలీకుండా..

అత్తమామల ఇంట్లో ఉన్న ప్రియురాలి వద్దకు అర్ధరాత్రి వెళ్లిన ప్రియుడు.. ఇద్దరూ గదిలో ఉండగా.. సడన్‌గా..
ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరికీ కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకే ఆ పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. ఇద్దరూ జీవితాంతం కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. అయితే అనూహ్యంగా ప్రియురాలిని వేరే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయినా వారిద్దరూ ఎవరికీ తెలీకుండా కలుసుకుంటూ ఉండేవారు. ఇటీవల ఓ రోజు ప్రియురాలిని చూసేందుకు ఏకంగా.. ఆమె అత్తగారింటికే వెళ్లాడు. అర్ధరాత్రి ఇద్దరూ ఏకాంతంగా ఉండగా.. అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఆ విషయంలో భర్తను కట్టడి చేసేందుకు ప్రియుడితో కలిసి జ్యోతిష్యుడిని సంప్రదించిన భార్య.. ఇంట్లో అల్మారా చెక్ చేసిన భర్త.. చివరకు..

యూపీలోని (UP) బనారస్ పరిధి ధామ్‌వాల్ గ్రామానికి చెందిన చందన్ పాండే.. బనాసర్ ప్రాంతంలో ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలో కొన్నేళ్ల క్రితం అతడికి సొంత గ్రామానికి చెందిన రూబీ దేవితో పరిచయం ఏర్పడింది. తర్వాత కొన్నాళ్లకు ఇద్దరి మధ్య ప్రేమ (love) మొదలైంది. ఇద్దరూ కలిసి జీవితాంతం కలిసి బతకాలని అనుకున్నారు. అయితే ఈ క్రమంలో ఆమెకు బీహార్‌లోని (Bihar) సోహ్రా అనే గ్రామానికి చెందిన రాజుతో 2018లో వివాహమైంది. అయినా రూబీ, చందన్.. తరచూ కలుసుకునేవారు. ఈ విషయం మొన్నటిదాకా ఎవరికీ తెలీకుండా జాగ్రత్తపడ్డారు. అయితే సోమవారం రాత్రి చందన్.. తన ప్రియురాలిని (girlfriend) చూసేందుకు ఆమె అత్తమామల ఊరికి వెళ్లాడు.

వంట గదిలో భోజనం చేస్తున్న భర్త.. మంటల్లో చిక్కుకోవడంతో.. అక్కడే ఉన్న భార్య చివరకు షాకింగ్ నిర్ణయం..

ఇద్దరూ అర్ధరాత్రి ఏకాంతంగా ఓ గదిలో ఉన్నారు. అయితే అదే సమయంలో రూబీ అత్తమామలకు అనుమానం వచ్చి గదిలో చూడగా విషయం బయటపడింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన.. రూబీ భర్త, మరికొందరు కలిసి చందన్‌ను బయటికి లాగి కర్రలతో చితకబాదారు. వద్దని వేడుకుంటున్న వారు మాత్రం వినిపించుకోలేదు. తీవ్రంగా దాడి చేయడంతో చివరకు చందన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిశీలించారు. రూబీ దేవి, ఆమె భర్త రాజు, బావ వీర్ బహదూర్, సచిన్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో మొదట రూబీ.. తమ ప్రేమ విషయాన్ని అంగీకరించలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: కడుపులో ఏదో కదులుతోందని ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. చివరకు నోటి ద్వారా పరిశీలించి బయటికి తీయగా..

Updated Date - 2022-11-15T21:18:55+05:30 IST

Read more