మూడో పెళ్లికి సిద్ధమైన మహిళను.. బైకులో ఎక్కించుకున్న ప్రియుడు.. మార్గమధ్యలో హెల్మెట్ పట్టుకోమని చెప్పి..

ABN , First Publish Date - 2022-11-16T19:53:07+05:30 IST

ఆమెకు అప్పటికి రెండు సార్లు వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా మరో యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. తననే పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో యువకుడు తన ప్రియురాలిని బైకు ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో..

మూడో పెళ్లికి సిద్ధమైన మహిళను.. బైకులో ఎక్కించుకున్న ప్రియుడు.. మార్గమధ్యలో హెల్మెట్ పట్టుకోమని చెప్పి..

ఆమెకు అప్పటికి రెండు సార్లు వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయినా మరో యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. తననే పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో యువకుడు తన ప్రియురాలిని బైకు ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో ప్రియురాలి చేతికి హెల్మెట్ ఇచ్చి.. పెట్రోల్ పట్టించుకుని వస్తానంటూ వెళ్లాడు. అయితే ఎంతకీ రాకపోవడంతో సదరు మహిళ (woman) చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ప్రేయసికి నిశ్చితార్థం జరుగుతోందని తెలుసుకున్న యువకుడు.. అర్థరాత్రి ప్రియురాలి తండ్రి, అన్న వద్దకు వెళ్లి..

బీహార్ (Bihar) భాగల్పూర్‌కు చెందిన మహిళకు కద్వాల్‌లోని పచ్‌గాచియాకు చెందిన వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే కొన్ని నెలల తర్వాత మనస్పర్థల కారణంగా అతన్ని విడిచిపెట్టింది. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం ఖగారియాలోని పస్రాహాలో ఓ రైతుతో రెండో వివాహం (Second marriage) జరిగింది. ప్రస్తుతం ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇదిలావుండగా, రెండేళ్ల క్రితం ధోల్‌బజ్జకు చెందిన సంతోష్ అనే వ్యక్తి.. కడ్వా గ్రామంలో జరుగుతున్న ఆనకట్ట పనులకు వచ్చాడు. ఆ పనులు చేసే క్రమంలో ఆమెకు అతడితో పరిచయం ఏర్పడింది. భర్త, పిల్లలు ఉన్నారనే విషయం పక్కన పెట్టి సంతోష్‌తో వివాహేతర సంబంధం (extramarital affair) కొనసాగించింది.

అత్తమామల ఇంట్లో ఉన్న ప్రియురాలి వద్దకు అర్ధరాత్రి వెళ్లిన ప్రియుడు.. ఇద్దరూ గదిలో ఉండగా.. సడన్‌గా..

కొన్నాళ్ల తర్వాత అతడితో పాటూ వెళ్లి.. వివిధ ప్రదేశాలు మారుతూ సహజీవనం సాగించింది. అయితే పది రోజుల క్రితం వీరిద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో సంతోష్.. ఆమెను వదిలించుకోవాలని చూశాడు. అయితే ఆమె మాత్రం తనను పెళ్లి చేసుకోవాలంటూ గొడవ చేయడం మొదలెట్టింది. ఈ క్రమంలో స్థానికులు కలుగజేసుకుని పంచాయితీ పెట్టించే ప్రయత్నం కూడా చేశారు. దీంతో ప్రియురాలికి ఫోన్ చేసి, తనతో పాటూ రావాలని చెప్పి బీహారీగంజ్ అనే ప్రాంతానికి తీసుకెళ్లాడు.

Viral Video: నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్న కొడుకు.. తల్లికి ఎలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చాడో చూడండి..

అయితే మార్గమధ్యలో ఆమెను హెల్మెట్ పట్టుకుని ఉండు, పెట్రోల్ పట్టించుకుని వస్తానని చెప్పి అటునుంచి అటే ఉడాయించాడు. దీంతో చివరకు బాధితురాలు.. తన ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. ఈ క్రమంలో కొందరు పెద్దలు కలుగజేసుకుని బాధితురాలి కుటుంబ సభ్యులకు సంతోష్ కుటుంబ సభ్యుల నుంచి కొంత ఆర్థిక సాయాన్ని అందించారు. దీంతో బాధితురాలిని.. ఆమె కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. గొడవకు సంబంధించి సమాచారం అందిందని, దీనిపై ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

వివాహానంతరం భర్తను దూరం పెట్టిన వధువు.. మూడో రోజు హనీమూన్‌లో భార్య ముసుగు తీసి చూడగా..

Updated Date - 2022-11-16T19:53:20+05:30 IST