Viral Video: నడిరోడ్డుపై ఏంటీ పనులంటూ ఈ యువతిపై నెటిజన్ల ఆగ్రహం.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-12-08T16:39:48+05:30 IST

నేమ్... ఫేమ్ కోసం కొందరు విచిత్రమైన పనులు చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలోకి వదులుతుంటారు. వీటిలో ఆసక్తికరంగా, ఆశ్యర్యకరంగా ఉన్న వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల..

Viral Video: నడిరోడ్డుపై ఏంటీ పనులంటూ ఈ యువతిపై నెటిజన్ల ఆగ్రహం.. అసలు కథేంటంటే..

నేమ్... ఫేమ్ కోసం కొందరు విచిత్రమైన పనులు చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలోకి వదులుతుంటారు. వీటిలో ఆసక్తికరంగా, ఆశ్యర్యకరంగా ఉన్న వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల యువతులు కూడా ఇలాంటి విన్యాసాలు చేస్తూ.. నెట్టింట హాట్‭టాపిక్‌గా మారుతున్నారు. ప్రస్తుతం ఓ యువతికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. నడి రోడ్డుపై ఏంటీ పనులంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు కథ ఏంటంటే..

Viral Video: యువతిని కలిసేందుకు వెనుక నుంచి బాల్కనీ ఎక్కిన యువకులు.. పైకి వెళ్లగానే ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో పాకిస్థాన్ యువతికి (Pakistani young woman) సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ (Viral photos videos) అవుతున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. సదరు యువతి రద్దీగా ఉన్న రోడ్డుపై బైకులో ముందు వెళ్తుండగా మరో రెండు బైకుల్లో నలుగురు యువకులు ఫాలో అవుతుంటారు. మధ్యలో యువతి హ్యాండిల్ (Bike stunts) వదిలేసి, బైకుపై నిలబడి 'పట్లీ కమరియా మోరీ...' అనే పాటకు ఫోజులు ఇస్తూ, డాన్స్ వేస్తుంది. వెనుక వస్తున్న యువకులు ఆమెను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు.

young-women-byke-ride.jpg

Viral Video: ఈ వధూవరులు డ్యాన్స్ చేసిన పాట విని అంతా షాక్... మధ్యలో అక్కడికి వచ్చిన వధువు తండ్రి..

యువతి వెనుక మరో వైపు ఓ బస్సు కూడా వస్తుంటుంది. అయితే వీరిలో ఒక్కరికి కూడా హెల్మెల్ ఉండదు. మరో వాహనంలో వెళ్తున్న వారు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో తెగ వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ నిర్లక్ష్యం వల్ల మీకు ప్రాణహాని జరగడంతో పాటూ ఎదుటి వారు కూడా ఇబ్బంది పడతారు.. అంటూ కొందరు, ఇలాంటి విన్యాసాలు చేయడం మంచిది కాదు అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లిన మహిళ.. గ్రామానికి తిరిగొచ్చి పంచాయితీలో భర్త ఎదుటే..

Updated Date - 2022-12-08T16:46:02+05:30 IST