నా భార్యను చంపేశా.. వచ్చి అరెస్ట్ చేసుకోండంటూ నేరుగా పోలీసులకే ఫోన్ చేసిన భర్త..!

ABN , First Publish Date - 2022-11-17T19:36:36+05:30 IST

భార్యల విషయంలో కొందరు భర్తలు మరీ రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. లేనిపోని అనుమానాలు పెట్టుకుని చిత్రహింసలకు గురి చేస్తుంటారు. మరికొందరు భర్తలు రోజూ తాగొచ్చి.. దాడులు చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలు..

నా భార్యను చంపేశా.. వచ్చి అరెస్ట్ చేసుకోండంటూ నేరుగా పోలీసులకే ఫోన్ చేసిన భర్త..!

భార్యల విషయంలో కొందరు భర్తలు మరీ రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. లేనిపోని అనుమానాలు పెట్టుకుని చిత్రహింసలకు గురి చేస్తుంటారు. మరికొందరు భర్తలు రోజూ తాగొచ్చి.. దాడులు చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా, రాజస్థాన్‌లో ఈ తరహా ఘటనే చోటు చేసుకుంది. నా భార్యను చంపేశా.. వచ్చి అరెస్ట్ చేసుకోండంటూ.. ఓ భర్త నేరుగా పోలీసులకే ఫోన్ చేశాడు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Viral Video: అమ్మబాబోయ్.. వీళ్లకెంత ధైర్యం.. మేకను మింగేందుకు సిద్ధమైన కొండ చిలువను ఏం చేశారంటే..

రాజస్థాన్ (Rajasthan) అజ్మీర్ జిల్లా బినాయ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక చాపనేరి అనే ప్రాంతంలో రాంప్రసాద్ అనే వ్యక్తి భార్య రియాతో నివాసం ఉంటున్నాడు. సంతోషంగా ఉన్న భార్యాభర్తల (husband and wife) మధ్య ఇటీవల సమస్యలు తలెత్తాయి. భార్య తప్పు చేస్తోందని రాంప్రసాద్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఈ విషయంలో తరచూ భార్యతో గొడవపడేవాడు. మంగళవారం కూడా ఇదే విషయమై దంపతుల మధ్య గొడవ (quarrels) జరిగింది. తర్వాత తన భార్యను బైకుపై ఎక్కించుకుని బయటికి తీసుకెళ్లాడు.

భర్త కోసం ఐదు రోజులుగా ఎదురుచూపులు.. ఆకలికి తట్టుకోలేక బయటికి వెళ్లిన తల్లీకూతుళ్లు.. అనుకోని విధంగా..

మార్గమధ్యలో ఒక్కసారిగా ఆమెను కిందకు తోసేశాడు. అంతటితో ఆగకుండా పెద్ద రాయితో ఆమె తలపై బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అనంతరం రాంప్రసాద్.. పోలీసులకు ఫోన్ చేసి, ‘‘నా భార్యను చంపేశా.. వచ్చి అరెస్ట్ చేసుకోండి’’.. అని చెప్పాడు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని పోలీసులు తెలిపారు. రాంప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

మూడో పెళ్లికి సిద్ధమైన మహిళను.. బైకులో ఎక్కించుకున్న ప్రియుడు.. మార్గమధ్యలో హెల్మెట్ పట్టుకోమని చెప్పి..

Updated Date - 2022-11-17T19:36:36+05:30 IST

Read more