అమ్మబాబోయ్.. వీళ్లకెంత ధైర్యం.. మేకను మింగేందుకు సిద్ధమైన కొండ చిలువను ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-11-17T18:28:39+05:30 IST

ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో కాస్త వినూత్నంగా ఉండే దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో ఆశ్చర్యకరంగా అనిపించే వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. జంతువులకు సంబంధించిన ..

అమ్మబాబోయ్.. వీళ్లకెంత ధైర్యం.. మేకను మింగేందుకు సిద్ధమైన కొండ చిలువను ఏం చేశారంటే..

ప్రస్తుతం దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడంతో కాస్త వినూత్నంగా ఉండే దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో ఆశ్చర్యకరంగా అనిపించే వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. కొండ చిలువకు చిక్కిన మేక (goat).. తప్పించుకునే క్రమంలో ఇబ్బంది పడుతూ ఉంటుంది. దాన్ని గమనించిన కొందరు పిల్లలు చివరకు విడిపించే ప్రయత్నం చేస్తారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Zomato Food Delivery: రూ.362 రీఫండ్ కోసం జొమాటో పై కేసు.. ఈ విద్యార్థికి ఎంత పరిహారం దక్కిందంటే..!

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. గడ్డి మేస్తున్న మేకల వద్దకు ఓ కొండచిలువ (python) వస్తుంది. అదును చూసి ఓ మేకపై దాడి చేస్తుంది. ఒక్కసారిగా మేకను చుట్టేసిన కొండచిలువ.. ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. చివరకు మింగే ప్రయత్నం చేస్తుండగా.. మేక తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. దాని బారి నుంచి బయటపడేందుకు శతావిధాలా ప్రయత్నిస్తుంది. కానీ కొండచిలువ మాత్రం దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకుని ఉంటుంది. చివరకు మేక ఎంతో అలసిపోయి పడుకుంటుంది. అదే సమయంలో అక్కడే ఉన్న కొందరు పిల్లలు దీన్ని గమనిస్తారు.

viral.jpg

Viral Video: నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్న కొడుకు.. తల్లికి ఎలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చాడో చూడండి..

భయం భయంగానే దాని వద్దకు వెళ్లి.. కొండ చిలువను పక్కకు లాగేందుకు ప్రయత్నిస్తారు. ఎక్కడ తమ మీద దాడి చేస్తుందో అన్న భయంతో మెల్ల మెల్లగా దాన్ని.. మేక నుంచి విడిపించే ప్రయత్నం చేస్తారు. చివరకు ఎలాగోలా కొండచిలువను పక్కకు లాగేస్తారు. దీంతో బతికిపోయాను దేవుడా!.. అని అనుకుంటూ మేక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు పిల్లల ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే.. మరికొందరు... మీ వీడియోల కోసం కావాలనే ఇలా చేసి.. మేకను ఇబ్బంది పెడతారా అంటూ విమర్శిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

viral2.jpg

Viral Video: కడుపులో ఏదో కదులుతోందని ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. చివరకు నోటి ద్వారా పరిశీలించి బయటికి తీయగా..

Updated Date - 2022-11-17T18:36:45+05:30 IST

Read more