Share News

AP News: పెన్షన్ కోసం వచ్చి కన్నీరు పెట్టుకుంటున్న వృద్ధులు.. కారణమిదే?

ABN , Publish Date - May 02 , 2024 | 11:26 AM

Andhrapradesh: పెన్సనర్ల విషయంలో ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మే 1 నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లు పంపిణీ చేస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. నిన్న మేడే బ్యాంకులకు సెలవు కావడంతో ఈరోజు ఉదయం నుంచి బ్యాంకుల వద్దకు పెన్షనర్లు చేరుకున్నారు. పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద పెన్షన్‌దారులు పడిగాపులు కాస్తున్నారు.

AP News: పెన్షన్ కోసం వచ్చి కన్నీరు పెట్టుకుంటున్న వృద్ధులు.. కారణమిదే?
AP Pensioners Struggled

విజయవాడ, మే 2: పెన్సనర్ల (Pensioners) విషయంలో ప్రభుత్వం (AP Government) తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మే 1 నుంచి మూడు రోజుల పాటు పెన్షన్లు పంపిణీ చేస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. నిన్న (బుధవారం) మేడే బ్యాంకులకు (Bank) సెలవు కావడంతో ఈరోజు ఉదయం నుంచి బ్యాంకుల వద్దకు పెన్షనర్లు చేరుకున్నారు. పెన్షన్ల కోసం బ్యాంకుల వద్ద పెన్షన్‌దారులు పడిగాపులు కాస్తున్నారు. తీరా పెన్షన్లు పొందే క్రమంలో బ్యాంకు అధికారులు చెబుతున్న రూల్స్‌తో పింఛన్‌దారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వృద్ధులు, వికలాంగులు బ్యాంకులకు వచ్చి పెన్షన్లు తీసుకునే క్రమంలో బ్యాంకు అకౌంటు రన్నింగ్‌లో లేదని బ్యాంక్ యాజమాన్యం చెబుతోంది.

MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు నిరాశ


బ్యాంకు అకౌంటు రన్నింగ్‌లో పెట్టుకోవాలంటే ఆధార్ జిరాక్స్, పాన్ జిరాక్స్, బ్యాంకు వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫిలప్‌ చేసి ఇవ్వాలని బ్యాంక్ సిబ్బంది రూల్స్ పెట్టారు. ఇవి రెండు ఇస్తేనే అకౌంట్ ఆపరేషన్‌లోకి వస్తుందని బ్యాంక్ సిబ్బంది చెబుతున్నారు. ఈరోజు సాయంత్రం అకౌంట్ఆపరేషన్‌లోకి వస్తుందని, రేపు వచ్చి డబ్బులు తీసుకోవాలని బ్యాంక్ అధికారులు తెలిపారు. అయితే కొందరు పెన్షనర్లకు అసలు పాన్‌కార్డు అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. చదువురాని తమని ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వృద్ధులు కన్నీరు పెట్టుకుంటున్నారు. తమను ఇలా ఎన్ని రోజులు ఎండల్లో తిప్పుతారని పెన్షన్‌దారులు ప్రశ్నిస్తున్నారు.


ఇన్‌ఆపరేట్ మోడ్‌లో మెజారిటీ బ్యాంక్‌ అకౌంట్లు...

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బ్యాంక‌ుల వద్ద పెన్షన్‌దారులు ఎదురుచూపులు చూస్తున్నారు. మారుమూల గ్రామాల్లో బ్యాంక్ శాఖలు లేకపోవడంతో మండల కేంద్రాల్లోని బ్యాంక్‌లకు ఆటోలు, బస్‌లలో పెన్షన్‌దారులు చేరుకుంటున్నారు. కాగా.. రాష్ట్రంలో 48 లక్షల 96 వేల మంది పెన్షన్ దారులకు బ్యాంక్ అకౌంట్‌లు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. అయితే మెజారిటీ బ్యాంక్ అకౌంట్లు ఇన్‌ఆపరేట్ మోడ్‌లో ఉన్నాయని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అకౌంట్ల ఆపరేషన్ మోడ్‌లోకి తీసుకురావాలంటే కొంత అమౌంట్ కూడా డిపాజిట్ కింద ఉంచాలని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. పాన్ కార్డు అంటే ఏమిటో చదువు రాని వాళ్లకు తమకు ఎలా తెలుస్తుందని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రశ్నించారు. సచివాలయాలలో తమకు పెన్షన్లను ఇవ్వకుండా బ్యాంకుల చుట్టూ తిప్పటం ఎంత వరకు సమంజసం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎండలకు నిన్ననే ఇద్దరు మృతి చెందారని, ఇంకెంత మందిని బలి కోరతాడు ఈ జగన్ అంటూ పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

AP Politics: మిగిలింది 10 రోజులు.. తమవైపు తిప్పుకునేందుకు నేతల యత్నాలు..

AP Elections: తిరగబడుతున్న ఓటర్లు.. ఆ నేతల్లో టెన్షన్..

Read latest AP News And Telugu News

Updated Date - May 02 , 2024 | 11:49 AM