Union Budget 2022.. లైవ్ అప్‌డేట్స్

ABN , First Publish Date - 2022-02-01T16:12:09+05:30 IST

బడ్జెట్ 2022.. సామాన్యుడికి ఊరటనిస్తుందా..? లేక ధరల పెనుభారాన్ని మోపుతుందా..? కరోనా ప్రభావంతో అల్లాడిపోతున్న చిరుద్యోగిపై కేంద్ర సర్కారు కరుణిస్తుందా..? లేదా..?

Union Budget 2022.. లైవ్ అప్‌డేట్స్

బడ్జెట్ 2022.. సామాన్యుడికి ఊరటనిచ్చిందా..? లేక ధరల పెనుభారాన్ని మోసిందా..? 

కరోనా ప్రభావంతో అల్లాడిపోతున్న చిరుద్యోగిపై కేంద్ర సర్కారు కరుణించిందా..? లేదా..? 

వేతన జీవులకు పన్ను వెసులుబాటు కల్పించిందా..? లేక పన్నుల గుదిబండను మోపిందా..?

రైతులకు ఏం చేశారు..? పరిశ్రమలకు ఇచ్చిన రాయితీలేంటి..? 

అయిదు రాష్ట్రాల ఎన్నికల బడ్జెట్‌గా మిగిలిపోయిందా..? లేక భారతదేశ ప్రజలందరి మనసును చూరగొందా..? 

నిర్మలమ్మ ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్‌లో అసలేమున్నాయో ఓ లుక్కేయండి..



 

@ 14:19PM Budget 2022: వేటి ధరలు పెరుగుతాయ్..? ఏఏ వస్తువల ధరలు తగ్గుతాయంటే..!


@ 13:43PM Budget 2022: నిర్మలమ్మ పద్దులో 10 బిగ్ అనౌన్స్‌మెంట్స్ ఇవే..!


12:48PM Budget 2022: కొత్తగా e-passport.. చిన్న సిలికాన్ చిప్‌లోనే అన్ని రహస్యాలు..!


@ 12:47PM గంటన్నర సేపు సాగిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం


@ 12:38PMబడ్జెట్ 2022 : ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కొత్త వార్తలేవీ లేవు


@ 12:32PM బడ్జెట్ 2022 : వజ్రాలపై కస్టమ్స్ సుంకం తగ్గింపు


@ 12:30PM బడ్జెట్ ముద్రణకు సంబంధించిన ఈ విషయాలు తెలిస్తే..


@ 12:12PM బడ్జెట్ 2022 : ఐటీ రిటర్నుల దాఖలు గడువు పెంపు


@ 12:07PM బడ్జెట్ 2022 : డిజిటల్ రుపీ త్వరలో


@ 12:06PM దేశంలో 60 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం


@ 12:05PM కరోనాతో మెంటల్ టెన్షన్.. విరుగుడుగా కొత్త పథకాన్ని ప్రకటించిన Nirmala Sitharaman


@ 11:57AM రసాయనాలు వాడకుండా వ్యవసాయం.. పైలెట్ ప్రాజెక్ట్ ఎక్కడంటే..


@ 11:56AM బడ్జెట్ 2022 : 5జీ స్పెక్ట్రమ్ వేలం ఈ ఏడాదే


@ 11:55AM వచ్చే మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లు: ఆర్థిక మంత్రి


@ 11:44AM Budget 2022 : తపాలా కార్యాలయాలన్నీ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి


@ 11:42AM దశాబ్దాల బడ్జెట్ సంప్రదాయాలకు చెక్.. నూతన పోకడల్లో మోదీ సర్కారు!


@ 11:33AM బడ్జెట్ 2022 : మూడేళ్ళలో 100 కార్గో టెర్మినల్స్ : నిర్మల సీతారామన్


@ 11:27AMనిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగానికి అధికార పక్ష సభ్యుల హర్షధ్వానాలు


@ 11:20AM బడ్జెట్ 2022 : నాలుగు అంశాలపై ప్రధాన దృష్టి


@ 11:12AM బడ్జెట్ 2022 ప్రసంగం ప్రారంభం


@ 11:11AM రానున్న పాతికేళ్ళకు బ్లూప్రింట్ ఈ బడ్జెట్‌లో : నిర్మల సీతారామన్


@ 11:05AM అత్యున్నత స్థాయికి ఎదిగిన ఆ ఏడుగురు ఆర్థిక మంత్రులు


@ 11:01AM నారింజ రంగు చేనేత చీర ధరించిన నిర్మల సీతారామన్


 @ 10:51AM బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం, సెన్సెక్స్ దూకుడు


@ 10:50AM మొబైల్ యాప్‌లో కేంద్ర బడ్జెట్...ఐదు ఆసక్తికర అంశాలు


@ 09:29AM రాష్ట్రపతి కోవింద్‌ను కలిసిన నిర్మలాసీతారామన్


@ 09:22AM Budget 2022 LIVE: ఉద్యోగులు, సామాన్యులు ఆశిస్తున్నదేంటి?


@ 09:11AM ఆర్థికమంత్రిత్వ శాఖకు చేరుకున్న నిర్మలా సీతారామన్


బడ్జెట్ 2022: ఈసారయినా క్రీడలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగేనా?


బడ్జెట్ 2022: స్టార్టప్‌ల ప్రోత్సాహంపై పరిశ్రమ అంచనాలివే..


నేడే బడ్జెట్ : రైతులకు, మధ్యతరగతికి ఊరట కలుగుతుందా..?


(పూర్తి సమాచారం కోసం లింక్‌పై క్లిక్ చేయండి)


  • వచ్చే 25 ఏళ్ల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్
  • ఆత్మనిర్భర్‌ భారత్‌కు విశేష స్పందన
  • కరోనా సంక్షోభ సమయంలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నాం
  • దేశంలో వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది
  • ప్రజల ప్రాణాలను కాపాడటంలో టీకా కీలకపాత్ర పోషించింది
  • కరోనా కట్టడిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం బాగా కలిసొచ్చింది
  • ఎయిరిండియా బదిలీ సంపూర్ణం
  • మౌలిక రంగంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం
  • నాలుగు అంశాల్లో అభివృద్ధికి ప్రాధాన్యం
  • వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన
  • పేద, మధ్య తరగతి పురోగతికి కృషి
  • రైల్వేలో సరుకుల రవాణాకు కొత్త ప్రాజెక్ట్‌లు
  • జాతీయ రహదారులను 25వేల కి.మీ.లకు పెంచుతాం
  • అత్యాధునిక సౌకర్యాలతో కొత్త వందే భారత్ రైలు
  • సేంద్రీయ వ్యవసాయానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు
  • తృణధాన్యాల ఉత్పత్తి, మార్కెటింగ్‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు
  • దేశంలో నాలుగు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్‌లు
  • గోదావరి-కృష్ణా, కృష్ణా-పెన్నా ప్రాజెక్ట్‌లకు డీపీఆర్ సిద్ధం
  • చిన్న పరిశ్రమలకు అదనంగా రూ.2లక్షల కోట్ల పరపతి సౌకర్యం
  • వరి, గోధుమకు మద్దతు ధర కింద రూ.2.7 లక్షల కోట్ల ప్రత్యక్ష చెల్లింపులు
  • ప్రాంతీయ భాషల్లో విద్యాభివృద్ధికి కొత్త టీవీ ఛానెళ్లు
  • మహిళాభ్యుదయానికి మహిళా శక్తి,..
  • మహిళా వాత్సల్యా సహా మూడు కొత్త పథకాలు
  • డ్రోన్ సాంకేతిక విజ్ఞానం పెంచేందుకు డ్రోన్ శక్తి పథకం
  • ఆత్మ నిర్భర్‌ భారత్‌ స్ఫూర్తితో 16 లక్షల ఉద్యోగాలు సృష్టించాం
  • వేగంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ
  • ప్రపంచంలోనే దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది
  • ఆర్థిక అభివృద్ధికి నాలుగు అంశాలకు అత్యంత ప్రాధాన్యత
  • మొదటి ప్రధాన అంశం పీఎం గతి శక్తి
  • ఇందులో ఏడు రకాల అంశాలపై దృష్టి పెడతాం
  • ఇది ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ ఏడాది
  • విద్యుత్‌, వంట గ్యాస్‌ ప్రతి ఇంటికి చేరేలా చేశాం
  • త్వరలో ఎల్‌ఐసీలో ఐపీవో ద్వారా ప్రైవేటీకరణ
  • పర్వత ప్రాంతాల్ని కలిపేలా పీపీపీ మోడల్లో పర్వత్‌మాలా కార్యక్రమం
  • పర్వత్‌మాల ప్రాజెక్టులో 8 రోప్‌వేల అభివృద్ధి
  • 60 కి.మీ దూరంతో ఒక్కో రోప్‌వే నిర్మాణం
  • డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థికసాయం
  • నీలాంచల్‌ నిస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ను ప్రైవేటుపరం చేశాం
  • వచ్చే ఐదేళ్లలో రూ.13 లక్షల కోట్ల ఉత్పదకతకు తగిన ప్రోత్సాహకాలు
  • 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తున్నాం
  • ఎంఎస్‌ఎంఈలకు మార్కెటింగ్‌ సహకారం కోసం నూతన పోర్టల్‌
  • ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం
  • వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం స్టార్టప్‌లకు సాయం
  • రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు పథకం
  • వంటనూనెల దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి
  • పీపీపీ మోడల్‌లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం
  • 1.5లక్షల పోస్టాఫిసుల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు
  • 75 జిల్లాల్లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు
  • 3.8కోట్ల రుణ సముదాయాలకు తాగునీటి కోసం రూ.60వేల కోట్లు
  • అన్ని మంత్రిత్వ శాఖల్లో కాగిత రహిత పాలన
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ-పాస్‌పోర్ట్ విధానం
  • ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త చట్టం
  • పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు
  • కార్మికుల నైపుణ్యాభివృద్ధి కోసం ఆన్‌లైన్‌లో నేర్చుకునేందుకు అవకాశాలు
  • ప్రధాని ఈ-విద్య కార్యక్రమం కింద టెలివిజన్‌ ఛానళ్లు 12 నుంచి 200కు పెంపు
  • ఉపాధ్యాయులకు డిజిటల్‌ నైపుణ్యాల శిక్షణ
  • విద్యార్థులకు అందుబాటులో ఈ- కంటెంట్‌
  • ఉపాధ్యాయులకు అందుబాటులోకి ప్రపంచస్థాయి ఉపకరణాలు
  • మానసిక సమస్యల చికిత్స కోసం ఆన్‌లైన్‌ టెలీమెడిసిన్‌ విధానం
  • బెంగళూరు ట్రిపుల్‌ ఐటీ సాంకేతిక సాయం అందిస్తుంది
  • పీఎం ఆవాస్‌ యోజనకు రూ. 48 వేల కోట్లు
  • పీఎం ఆవాస్‌ యోజన కింద 18 లక్షల ఇళ్లు
  • వ్యవసాయ వర్సిటీల్లో సిలబస్‌ మార్పులు
  • జీరో బడ్జెట్‌ ఫార్మింగ్‌, సేంద్రీయ సాగుకు ప్రోత్సాహకాలు
  • మినియం, మ్యాగ్జిమం గవర్నమెంట్‌ లక్ష్యంలో భాగంగా కాలం తీరిన చట్టాలు రద్దు
  • జిల్లాలవారీగా వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి పథకం
  • నల్‌ సే జల్‌ కింద 5.7 కోట్ల కటుంబాలకు అందుబాటులోకి తాగునీరు
  • మహిళలు, చిన్నారుల అభివృద్ధికి 3 ప్రత్యేక పథకాలు
  • రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తులకు 68శాతం నిధుల కేటాయింపు
  • డీఆర్డీవో, ఇతర సంస్థల మధ్య సమన్వయానికి కృషి
  • 5జీ మొబైల్ సేవల కోసం 2023లో స్పెక్ట్రం వేలం
  • బొగ్గును రసాయనంగా మార్చేందుకు 4 పైలట్ ప్రాజెక్ట్‌లు
  • గంగా పరివాహం వెంబడి నేచురల్‌ ఫార్మింగ్‌ కారిడార్‌
  • దేశవ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేషన్‌ పథకం(ఎన్‌జీడీఆర్‌ఎస్‌)
  • దేశంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్‌కు నూతన వ్యవస్థ
  • దేశవ్యాప్తంగా డీడ్‌లు, రిజిస్ట్రేషన్లకు ఆధునిక వ్యవస్థ
  • కాంట్రాక్టర్లకు ఈ- బిల్లులు పెట్టుకునే అవకాశం
  • బిల్లుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకునే సౌకర్యం
  • ఉత్తర సరిహద్దుల్లో గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం
  • 112 ఏస్పిరేషన్‌ జిల్లాల్లో 95శాతం వైద్య సౌకర్యాలు
  • వచ్చే మూడేళ్లలో 100 పీఎం గతిశక్తి టెర్మినల్స్‌ ఏర్పాటు
  • నదుల అనుసంధానానికి 5 డీపీఆర్‌లు సిద్ధం
  • గోదావరి- కృష్ణా, పెన్నా- కృష్ణా, పెన్నా- కావేరీ, దమన్‌ గంగా- పింజాల్‌, పర్తపి- నర్మద నదుల అనుసంధానం
  • పన్నుల రిటర్న్స్‌లో కొత్త విధానాలు అమలు
  • అదనపు పన్ను చెల్లింపు ద్వారా అప్‌డేట్ చేసుకునే అవకాశం
  • ట్యాక్స్ రిటర్న్స్‌ అప్‌డేట్ చేసేందుకు రెండేళ్ల సమయం
  • సహకార సంఘాలకు 15శాతం పన్ను
  • సహకార సంఘాల పన్నుపై సర్‌చార్జ్ 7 శాతానికి తగ్గింపు
  • ఎన్పీఎస్ ఖాతాలో పన్ను మినహాయింపు పరిమితి 14 శాతానికి పెంపు
  • ప్రణాళికా వ్యయం కేటాయింపులు 35.4శాతం పెంపు
  • రూ.7.5 లక్షల కోట్లతో ప్రణాళికా వ్యయం
  • దేశీయంగా సౌర విద్యుత్‌ ప్లేట్ల తయారీకి ఉత్పత్తి ఆధారిత
  • మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు కేంద్రసాయం
  • రాష్ట్రాల ఆర్థికసాయంగా రూ. లక్ష కోట్లతో ప్రత్యేక నిధి
  • ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు
  • దేశవ్యాప్తంగా మూలధనం పెట్టుబడుల కోసం రూ.10.68 లక్షల కోట్లు
  • ఈ ఏడాదిలోనే డిజిటల్‌ కరెన్సీ
  • డిజిటల్‌ రూపీని విడుదల చేయనున్న ఆర్‌బీఐ
  • బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ సాయంతో ఆర్బీఐ డిజిటల్‌ రూపాయి
  • 2022-23 మొత్తం బడ్జెట్‌ అంచనాలు రూ.39.45 లక్షల కోట్లు
  • 2022-23 బడ్జెట్‌లో ద్రవ్య లోటు 6.9 శాతం
  • 2025-26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించడం లక్ష్యం
  • ప్రస్తుతానికి ఆదాయ వనరులు రూ.22.84 లక్షల కోట్లు
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ మినహాయింపు
  • ఎన్‌పీఎస్‌ మినహాయింపులు 14 శాతం పెంచుకునే అవకాశం
  • 2022-23లో రాష్ట్రాలకు ద్రవ్యలోటు పరిమితుల్లో ఊరట
  • జీఎస్‌డీపీలో 4 శాతం వరకూ ద్రవ్యలోటుకు అనుమతి

Updated Date - 2022-02-01T16:12:09+05:30 IST