బడ్జెట్ 2022: ఈసారయినా క్రీడలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగేనా?

ABN , First Publish Date - 2022-02-01T15:18:36+05:30 IST

మరికాసేపట్లో బడ్జెట్- 2022ని లోక్‌సభలో..

బడ్జెట్ 2022: ఈసారయినా క్రీడలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగేనా?

మరికాసేపట్లో బడ్జెట్- 2022ని లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా సామాన్యుల దృష్టి బడ్జెట్‌పైనే ఉంటుంది. ఈ నేపధ్యంలో వారంతా బడ్జెట్‌పై కోటి ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది బడ్జెట్‌లో కరోనా వైరస్ కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభ పరిస్థితుల ప్రభావం కనిపించింది. పలు రంగాలకు నిధుల కేటాయింపుల్లో వేటు పడింది. ముఖ్యంగా క్రీడారంగానికి అతి తక్కువ కేటాయింపులు జరిగాయి. 




దీంతో ఈసారి బడ్జెట్‌లో క్రీడలకు అత్యధిక కేటాయింపులు ఉంటాయని పలువురు ఆశిస్తున్నారు. 2020-21 బడ్జెట్‌లో క్రీడారంగానికి రూ.890.42 కోట్లు కేటాయించారు. అయితే ఈ రోజు ప్రవేశపెట్టబోయే 2022 బడ్జెట్‌లో దీనిపై రూ.232.71 కోట్ల కోత ఉండవచ్చనే అంచనాలున్నాయి. దీంతో ఈ సారి క్రీడారంగానికి మొత్తంగా రూ. 675.71 కోట్లు కేటాయించవచ్చని తెలుస్తోంది. జాతీయ క్రీడా సమాఖ్యల కోసం సవరించిన కేటాయింపులో రూ. 35 కోట్లు అదనంగా కేటాయించారు. దీంతో 2022 ఆర్థిక సంవత్సరంలో దీనిని రూ. 280 కోట్లకు పెంచాల్సివుంటుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కూడా బడ్జెట్ కేటాయింపులను పెంచాల్సివుంది. కాగా భారత క్రీడాకారులు ఇటీవల టోక్యో ఒలింపిక్, పారాఒలింపిక్‌లో తమ ప్రతిభ చాటారు. ఇటువంటి నేపధ్యంలో 2022 బడ్జెట్‌లో క్రీడారంగానికి నిధుల కేటాయింపును పెంచాలని క్రీడాకారులు కోరుతున్నారు.

Updated Date - 2022-02-01T15:18:36+05:30 IST