ఆర్థికమంత్రిత్వ శాఖకు చేరుకున్న నిర్మలా సీతారామన్

ABN , First Publish Date - 2022-02-01T14:41:26+05:30 IST

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఉదయం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు...

ఆర్థికమంత్రిత్వ శాఖకు చేరుకున్న నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఉదయం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు.భారతదేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ తాజా సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తన నాల్గవ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. జీతభత్యాలు పొందుతున్న ఉద్యోగులు ఆదాయపు పన్ను ఉపశమనం కోసం ఎదురుచూస్తున్నారు.2070 నాటికి కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలనే భారతదేశ లక్ష్యంతో, పునరుత్పాదక ఇంధన రంగం, అనుబంధ పరిశ్రమలు రాయితీలను ఆశిస్తున్నాయి.


ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతి రంగ అవసరాలకు అనుగుణంగా సమ్మిళిత బడ్జెట్‌ను సమర్పించనున్నారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు.ఈ బడ్జెట్  ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ 2022 ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఉండేలా చూస్తుందని అన్నారు.బడ్జెట్‌ పట్ల ప్రజలు ఎంతో సంతోషిస్తారని పంకజ్ చౌదరి అన్నారు.


Updated Date - 2022-02-01T14:41:26+05:30 IST