Home » Telangana » Rangareddy
బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఓవ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన కొడంగల్‌లో జరిగింది. ఎ
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని ఎమ్మెల్మే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని చౌదరిగూడకు చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. టిప్పర్ లారీ బైక్‌ను ఢీ కొట్టడంతో తల్లీకూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. తన కళ్లముందే తన భార్య, బిడ్డను పోగొట్టుకున్న క్షతగాత్రుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. విగతజీవులుగా పడి ఉన్న తల్లీకూతుళ్లను పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు.
వీధికుక్క దాడిలో ఓ బాలుడు, మహిళకు గాయాలైన ఘటన జిల్లేడ్ చౌదరిగూడ మండలం చింతకుంట తండా గ్రామ పంచాయతీ పరిధిలోని గోవులబండ తండాలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. తండావాసులు కథనం మేరకు..
మండల పరిధిలోని మంగల్‌పల్లి అటవీ ప్రాంతంలో అస్థిపంజరం లభ్యమైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం మేరకు..
భార్యను హత్యచేసిన భర్తకు ఎల్బీనగర్ కోర్టు రూ.5 వేల జరిమానాతో పాటు జీవిత ఖైౖదు విధించింది. 2021లో మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడకు చెందిన అలువాల నర్సింహ(35) తన భార్య లక్ష్మమ్మ(30)ను హత్య చేశాడు.
జనగాం గ్రామానికి చెందిన విద్యార్థులు, వారి తల్లితండ్రులు బుధవారం మంబాపూర్ గ్రామంలో ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల హామీతో విరమించారు. పెద్దేముల్ మండలం జనగాం గ్రామానికి సమయానుకూలంగా రోజూ ఉదయం, సాయంత్రం ఆర్టీసీ బస్సు సర్వీస్ నడుస్తుంది. గ్రామ సమీపంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ కారణంగా అక్కడ బురదగా మారింది. వారం క్రితం ఆ బురదలో బస్సు దిగబడింది.
తాండూరు మండ లంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన గ్యాంగ్ హల్‌చల్ చేస్తుంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఈ గ్యాంగ్ తాండూరు నియోజకవర్గంలోని గ్రామా ల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
రాజకీయాలకతీతంగా కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల అబివృద్ధికి సహకారం అందించాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొందుర్గులో మినీ స్టేడియం నిర్మాణ పనుల కోసం నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన యాలాల మండల పరిధిలోని గౌతమి మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన తాండూరు నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే, వీఎంఆర్ కప్పు క్రీడా పోటీలను ప్రారంభించారు.