Share News

సాగులో లేని భూముల వివరాల సేకరణ

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:52 PM

జిల్లాలో సాగుకు అనువుగా లేని భూముల వివరాలను జిల్లా రెవెన్యూ యంత్రాంగం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

సాగులో లేని భూముల వివరాల సేకరణ
సాగులో లేని భూములను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి, ఆర్డీవో సైదులు

ఘట్‌కేసర్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సాగుకు అనువుగా లేని భూముల వివరాలను జిల్లా రెవెన్యూ యంత్రాంగం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో బాగంగా శనివారం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని పోచారంలో సర్వేనెంబర్లు 35, 37, 38, 39, 40, 60, 61లోని వ్యవసాయానికి అణువుగా లేని భూములను మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్‌ విజయేందర్‌రెడ్డి, కీసర ఆర్డీవో సైదులు పరిశీలించి వివరాలు సేకరించారు. అదేవిధంగా యంనంపేట్‌లోని సర్వేనెంబర్‌ 121, మేడిపల్లి మండలంలోని బోడుప్పల్‌ సర్వేనెంబర్‌ 168లోని భూమిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్‌ తహసీల్దార్‌ రజిని, వ్యవసాయ అధికారి బాసిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 11:52 PM