Share News

బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై కేసులు

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:51 PM

బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు శనివారం బంట్వారం ఎస్‌ఐ శ్రీశైలం యాదవ్‌ తెలిపారు.

బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై కేసులు

బంట్వారం జనవరి 11 (ఆంధ్రజ్యోతి): బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు శనివారం బంట్వారం ఎస్‌ఐ శ్రీశైలం యాదవ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం కేంద్రంలోని రక్తమైసమ్మ ఆలయం వద్ద బహిరంగంగా మద్యం సేవించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నరని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని అక్కడే మద్యం సేవిస్తున్న 10 మందిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలో ఎక్కడైనా బహింరంగా ఎవరైనా మద్యం సేవిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jan 11 , 2025 | 11:51 PM