Share News

బస్సు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:44 PM

బస్సు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బొంరా్‌సపేట్‌ మండలంలో జరిగింది.

బస్సు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు

బొంరా్‌సపేట్‌, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): బస్సు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బొంరా్‌సపేట్‌ మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు బొంరా్‌సపేట్‌కు చెందిన పెద్దకటికే సలీం(20) తుంకిమెట్ల గ్రామంలోని పాత ఇనుప సామాను కొనుగోలు దుకాణంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రోజూమాదిరిగా పని ముగించుకొని శనివారం రాత్రి తిరిగి నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా తుంకిమెట్ల సమీపంలోని కాకరవాణి వాగుపై గల వంతెనపై హైదరాబాద్‌ నుంచి కర్ణాటకకు వెళ్తున్న బస్సు ఢీకొంది. ఈ ఘటనలో సలీం కాలు విరిగింది. గమనించిన స్థానికులు వెంటనే కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. యువకుడు సలీంను ఢీకొట్టిన బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సలీం నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో రోజు కష్టపడితే కాని పూట గడవని స్థితి. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని పలువురు డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 11 , 2025 | 11:44 PM