Share News

పథకాల అమలుపై సీఎం సమావేశం

ABN , Publish Date - Jan 11 , 2025 | 12:23 AM

హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ పథకాల అమలుపై గ్రామాల్లో గ్రామ సభలు, మునిసిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు.

పథకాల అమలుపై సీఎం సమావేశం

పాల్గొన్న కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు

వికారాబాద్‌, ఆంధ్రజ్యోతి ప్రతినిధి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ పథకాల అమలుపై గ్రామాల్లో గ్రామ సభలు, మునిసిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు. రైతులు పంట వేసినా.. వేయకున్నా వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలని, వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి మినహాయించాలని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ, మునిసిపాలిటీల రికార్డులను క్రోడీకరించుకోవాలని, గ్రామాల మ్యాప్‌లను పరిశీలించి క్షేత్ర స్థాయిలో ధ్రువీకరించుకోవాలని సీఎం వారికి సూచించారు. సమావేశంలో వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 12:23 AM