కాగజ్నగర్ మున్సిపాలిటీలో పని చేసే కాంట్రాక్టు కార్మికులు పీఎఫ్ సమస్యను అధికారులు తేల్చడం లేదు. కష్టపడి పని చేసిన కార్మికులకు భవిష్యత్తులో భరోసా కల్పించాల్సిన ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) సొమ్ము సకా లంలో చెల్లించక పోవడంతో కాగజ్నగర్ మున్సిపా లిలోని కాంట్రాక్టు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లాలో వానరాల బెడద అధికంగా ఉంది. జిల్లా కేంద్రంలోనూ వానరాల బెడద రోజురోజుకు పెరుగుతోంది. తరుచూ ఇళ్లలోకి చొరబడి వృద్ధులు, పిల్లలపై దాడులు చేస్తున్నాయి. వానరాలు గుంపులుగుంపులుగా కాలనీలపై విరుచుకు పడుతున్నాయి. ఇళ్లు, దుకాణాలలో తిను బండరాలు, వస్తువులను ఎత్తుకెళ్లడంతో పాటు పండ్ల చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడులకు పాల్పడుతూ గాయపరుస్తున్నాయి
దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అయా మండపాల వద్ద కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు, అన్నదా నాలు కొనసాగుతున్నాయి. బజారువాడి హనుమాన్ మందిర్లో అర్చకుడు ఉపేందర్ ఆధ్వర్యంలో మహిళలచే కుంకుమార్చన చేయించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అ
వానా కాలం సీజన్కు సంబంధించి పత్తి కొనుగోళ్లకు ప్రభు త్వం సమాయత్తం అవుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి కొనుగోళ్లు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
జిల్లాలో భూ రీసర్వే పనులను వేగవంతంచేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టిందని కలెక్టర్ కె హరిత అన్నారు. శనివారం కలెక్టరేట్లో మండల సర్వేయర్లకు జీఎన్ఎస్ఎస్ రోవర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ పరికరాలు భూ రీసర్వే ప్రక్రియలో కీలకంగా ఉపయోగపడనున్నాయని నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసేందుకు వీలవుతుందని తెలిపారు.
రైతులు రబీ సీజన్లో పంట సాగు చేయవద్దని, ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్నందున సాగు ఆలోచన మానుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు విజ్ఞప్తి చేశారు.
సెంటు భూమి లేకపోయినా వ్యవసాయంపై ఆధారపడి సాటి రైతుల భూములను కౌలుకు తీసుకొని కాలం వెల్లదీస్తున్న కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎల్నినో ప్రభావంతో ఆశించిన మేర వర్షాలు కురవక పంట పొలాలు ఎండిపోతున్నా యి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలేవి వర్తించకపోవడంతో అప్పులపాలవుతున్నామని, బ్యాంకులు సైతం రుణాలివ్వకపోవడంతో ప్రైవేలు వ్యక్తుల వద్ద తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని మదన పడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తు న్న వారిని రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు.
తరతరాలుగా అధిక జనా భా ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రజల ఓట్లతో గద్దెనెక్కుతున్న వారి కి త్వరలోనే కాలం చెల్లబోతుందని, తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది ఇక బీసీల రాజ్యమేనని తెలంగాణ రా జ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వి ద్యార్థులు, మహిళలు, నిరుద్యోగ యు వతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, యూత్ డిక్లరేషన్ను వెం టనే అమలుచేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షు డు దన్నోజు నరేష్చారి డిమాండ్ చేశారు.