నర్సాపూర్‌లో 22A నిషేధిత భూముల జాబితాని వ్యతిరేకిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి వెకిలి చేష్టల వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి మెదక్ జిల్లా విద్యాశాఖ స్పందించింది. మెదక్ జిల్లా పాపన్నపేట జడ్పీహెచ్‌ఎస్ తెలుగు ఉపాధ్యాయుడు ఎం.నర్సింలును సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.రాజు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
భూములు కాపాడండంటూ పేద రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని టీ బీజేపీ చీఫ్ ఎన్.రాంచందర్ రావు తెలిపారు. 22 ఏ నిషేధిత జాబితాపై శ్వేత పత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన కొనసాగుతోంది. ఉమ్మాపూర్‌లో రూ.7.28 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల బాలికలు, బాలుర నూతన హాస్టల్ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.
జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్ల గైర్హాజరుపై తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిపై విచారణకు మంత్రి ఆదేశించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఎరువుల యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమం అధికారుల తీవ్ర నిర్లక్ష్యం, సమన్వయ లోపం కారణంగా గందరగోళంగా మారింది.
మంత్రి కొండా సురేఖ అంశంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ స్పందించారు. సురేఖ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని చెప్పారు. ఇప్పటికే ప్రిలిమినరీ రిపోర్ట్‌ను AICC, PCCకి అందజేశామన్నారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడ్డంకులు సృష్టిస్తుందో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమాధానం చెప్పాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తే అనుమతి నిరాకరించడం కేంద్రం నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.