Medak News: తండ్రి సర్పంచ్‌గా గెలుపు.. కొడుకు భిక్షాటన.!
ABN , Publish Date - Dec 21 , 2025 | 02:23 PM
ఎన్నికల్లో తన తండ్రి గెలిస్తే భిక్షాటన చేస్తానని మొక్కుకున్నాడో కుమారుడు. అంతిమంగా తండ్రి విజయం సాధించడంతో కొడుకు కోరిక నెరవేరింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.
మెదక్ జిల్లా, డిసెంబర్ 21: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో(TG Panchayat Elections) విజయం సాధించిన అభ్యర్థులు, వారి కుటుంబాల్లో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో తమ తండ్రి గెలిస్తే భిక్షాటన చేస్తానని 'బిచ్చగాడు(Bichagadu)' సినిమా తరహాలో ప్రతిన బూనాడో కుమారుడు. వివరాల్లోకెళితే...
రామాయంపేట(Ramayampeta) మండలం ఝాన్సీ లింగాపూర్(Jhansi Lingapur) గ్రామంలో ఎం.రామకృష్ణయ్య(Ramakrishnaiah) అనే వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఇదే ఎన్నికల్లో ఆయన పెద్ద కుమారుడు కూడా బరిలో దిగాడు. ఈ నేపథ్యంలో ఆయన చిన్న కుమారుడు భాస్కర్.. తండ్రి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాడు. ఈ ఎన్నికల్లో తన తండ్రి గెలిస్తే.. భిక్షాటన చేస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నట్టుగానే.. తన తండ్రి సర్పంచ్ అయ్యారు. మొక్కుబడి చెల్లించడంలో భాగంగా భాస్కర్ ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేసి.. కర్ణాటక రాష్ట్రంలోని గానుగాపూర్ దత్త క్షేత్రానికి వెళ్లాడు.
ఈ ఘటనపై జే.లింగాపూర్ గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తండ్రిపై గల కుమారుడికి ఉన్న అంకితభావాన్ని కొనియాడుతూ అభినందనలు తెలిపారు.
ఇవీ చదవండి:
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు రాజ్యాంగంపై గౌరవం లేదు
చిరిగిన జీన్స్.. స్లీవ్‌లెస్ పై నిషేధం