Siddipet Tragedy: అప్పుల బాధ భరించలేక దంపతుల అత్మహత్య
ABN , Publish Date - Dec 21 , 2025 | 01:47 PM
ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న చిన్న విషయాలకే తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. ప్రేమ విఫలం, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎన్నో కారణాల వల్ల డిప్రేషన్ లోకి వెళ్లి ప్రాణాలు తీసుకుంటున్నారు.
సిద్దిపేట జిల్లా(Siddipet District) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు (Pesticide)తాగి భార్యాభర్త (couples)లు ఆత్మహత్యకు పాల్పపడ్డారు. ఈ విషాద సంఘటన బెజ్జంకి(Bejjanki) మండలం దాచారం(Dacharam) లో చోటు చేసుకుంది. వడ్లకొండ శ్రీహర్ష, రుక్మిణి దంపతులు బెజ్జంకిలో ఓ బట్టల షాపు (Clothing store)నిర్వహిస్తున్నారు. శ్రీహర్ష (Sri Harsha) మధ్యవర్తి(Mediator)గా ఉండి తన బంధువైన పల్లె అనీల్‌కు రావికంటి అభిషేక్,పప్పుల రాజశేఖర్, వంగల భూపతిరెడ్డి,నాంపల్లి శ్రీనివాస్ వద్ద లక్షల్లో డబ్బు అప్పు ఇప్పించాడు. అనుకున్న సమయానికి తిరిగి డబ్బు చెల్లించలేకపోయాడు అనీల్. ఎన్నిసార్లు డబ్బు చెల్లించాలని చెప్పినా అనీల్ పట్టించుకోలేదు. మరోవైపు తమ డబ్బు వెంటనే చెల్లించాలని శ్రీహర్షను అభిలాష్,భూపతి రెడ్డి తరుచూ బెదిరిస్తూ వచ్చారు. శనివారం రోజు కుటుంబ సభ్యుల ముందు శ్రీహర్షకు గట్టిగా వార్నింగ్ (Warning) ఇచ్చారు.
గ్రామంలో తమ పరువు పోతుందని మానసికంగా కుంగిపోయిన శ్రీహర్ష, రుక్మిణి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పపడ్డారని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అప్పులు ఇచ్చిన వారు తమను మానసికంగా వేధించినట్లు వారి పేర్లు సూసైడ్ నోట్‌లో రాసి దంపతులు ఆత్మహత్యకు పాల్పపడినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో హ్యాపీగా ఉన్న దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో దాచారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు రాజ్యాంగంపై గౌరవం లేదు
చిరిగిన జీన్స్.. స్లీవ్‌లెస్ పై నిషేధం