అభివృద్ధికి కేరాఫ్‌గా సనత్‌నగర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో 2014 తర్వాతనే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపెట్టామని పేర్కొన్నారు.
ఐబొమ్మ రవి కస్టడీ విచారణ నేటితో ముగియనుంది. చివరి రోజు రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. విచారిస్తున్నారు. విచారణలో రవి పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం.
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిరంజన్ చెప్పలేనంత అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పించారు.
హైదరాబాద్ నగర భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి త్వరితగతిన స్పందించే విధంగా పోలీసు బృందాలు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
న్యూఇయర్ వేడుకలే లక్ష్యంగా హైదరాబాద్‌కు భారీగా డ్రగ్స్‌ను తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌వోటీ మాదాపూర్ పోలీసుల స్పెషల్ డ్రైవ్‌లో పలువురు డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్ అయ్యారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు మావోయిస్టు పార్టీ సంచలన లేఖ రాసింది. ఆయుధ విరమణపై కీలక ప్రకటన చేసింది.
భాగ్యనగరంలో మరోసారి భూముల వేలానికి హెచ్ఎండీఏ అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కోకాపేట, మూసాపేట భూములకు సోమవారం నుంచి ఈ వేలం వేయనున్నారు
ఐబొమ్మ రవిని గత నాలుగు రోజులుగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణలో పోలీసులకు రవి సరిగా సహకరించడం లేదనే వార్తలు వస్తున్నాయి.
వీసా రాకపోవడంతో ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ పద్మారావు నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వైద్యురాలు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
శామీర్‌పేట్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారులో మంటలు వ్యాపించి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.