Share News

ఆ ఏరియాల్లో.. 10గంటల నుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Feb 13 , 2026 | 06:45 AM

బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని తెలిపారు.

ఆ ఏరియాల్లో.. 10గంటల నుంచి కరెంట్ కట్

  • హైదరాబాద్‏లో నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలివే..

హైదరాబాద్: బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ ఎన్‌బీటీ నగర్‌, ఏసీబీ కార్యాలయం, సత్యసాయి ఫీడర్ల పరిధి, ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు 11కేవీ కళింగ ఫంక్షన్‌ హాల్‌ ఫీడర్‌ పరిధి, ఉదయం 11:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు 11కేవీ వేమిరెడ్డి గార్డెన్స్‌ ఫీడర్‌ పరిధి, మధ్యాహ్నం 12:30 నుంచి 1:20 గంటల వరకు 11కేవీ గ్రీన్‌ బంజారా కాలనీ ఫీడర్‌ పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11కేవీ కమలాపురి కాలనీ, కనకదుర్గ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.


కేపీహెచ్‌బీకాలనీ: టీజీఎస్పీడీసీఎల్‌ బాలాజీనగర్‌ సెక్షన్‌ పరిధి కైత్లాపూర్‌, బాలాజీనగర్‌ సబ్‌స్టేషన్ల నిర్వహణ కోసం శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూకట్‌పల్లి కోర్టు, అంబేడ్కర్‌నగర్‌, కైత్లాపూర్‌, రాఘవేంద్ర కాలనీ, ఆంజనేయనగర్‌, బాలాజీనగర్‌, వివేక్‌నగర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు.


చిక్కడపల్లి: ఆజామాబాద్‌ డివిజన్‌, హైదరాబాద్‌ సిటీ-2 పరిధిలో శుక్రవారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీఏడీఈలు జి. నాగే శ్వరరావు, డి.వినోద్‌కుమార్‌ తెలిపారు. కమలానగర్‌, గోల్నాక, జిందాతిలిస్మాత్‌, సుందర్‌నగర్‌, మూసీ నది, ఏవీ కాలేజీ 11 కేవీ విద్యుత్‌ ఫీడర్ల పరిధిలో ఉద యం 10గంటల నుంచి మధ్యాహ్నం 1వరకు, 6నెంబర్‌క్రాస్‌రోడ్‌, ఖాద్రీబాగ్‌, సాయిమధురానగర్‌, బతుకమ్మకుంట, గగన్‌మహల్‌ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని తెలిపారు.


రామంతాపూర్‌: రామంతాపూర్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఈ నెల 13న శుక్రవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం నెలకొంటుందని సంబంధిత ట్రాన్స్‌ కో ఏఈ కూతడి లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా లక్ష్మీనగర్‌ ఫీడర్‌లోని సాయి చిత్రనగర్‌, లక్ష్మీనగర్‌, ఈఎస్ఐ ఆసుపత్రి, పబ్లిక్‌ స్కూల్‌, పెట్రోల్‌ బంక్‌, ల్యాండ్‌ మార్క్‌ హోటల్‌ ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, దూరదర్శన్‌ ఫీడర్‌లోని హోమియోపతి ఆసుపత్రి, దూరదర్శన్‌ కేంద్రం, ఎన్‌ఎస్ఐటీ, ఎస్‌ఐఈటీ, ఏటీఐ ప్రాంతాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా ఉండదని ఆమె పేర్కొన్నారు.


city1.3.jpgఉప్పల్‌: విద్యుత్‌ మరమ్మతుల నేపథ్యంలో శుక్రవారం చిలుకానగర్‌ పరిధిలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ వినయ్‌కుమార్‌ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యా హిల్స్‌ ఫీడర్‌ పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సూర్యాహిల్స్‌, ఈదియా నగర్‌, న్యూ హేమానగర్‌, రాజశేఖర్‌ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్‌ ఎన్‌ఎస్‌ కాలనీ ఫీడర్‌ పరిధిలో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సాయినగర్‌, ఆర్‌ఎన్‌ఎస్‌ రాయల్‌ మెడోస్‌, ఆర్‌ఎన్‌ఎస్‌ డ్రీమ్‌ హోమ్స్‌, ఆర్‌ఎన్‌ఎస్‌ కాలనీ, ఆర్‌ఎన్‌ఎస్‌ ఫేజ్‌-3, పద్మావతి కాలనీ, అమ్మసాని వెంకట్‌ రెడ్డి కాలనీ, టెలిఫోన్‌ కాలనీ, అంజయ్య ఎన్‌క్లేవ్‌, రాజలింగం కాలనీ ఫేజ్‌--1, ఎస్‌బీఆర్‌ కాలనీ ప్రాంతాల్లో సరఫరా ఉండదని వెల్లడించారు.


గాజులరామారం: గాజులరామారం విద్యుత్‌ సబ్‌-స్టేషన్‌ పరిధిలోని గాజులరామారం 11 కేవీ ఫీడర్లలో మరమ్మతుల కారణంగా శుక్రవారం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ చైతన్య భార్గవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బాలజీ లే-అవుట్‌, తత్వా స్కూల్‌ లేన్‌, రాయల్‌ ప్లేమ్స్‌, పాస్తిమ్‌ ప్లేస్‌ అపార్టుమెంట్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండని ఏఈ పేర్కొన్నారు.


హైదర్‌నగర్‌: విద్యుత్‌ లైన్ల మరమ్మతుల కారణంగా 11కేవీ జయనగర్‌, ఎల్లమ్మబండ విద్యుత్‌ పీడర్ల పరిధిలో శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జయనగర్‌, మాధవినగర్‌, అరుణసొసైటీ, మహాకాళినగర్‌, మహావీర్‌నగర్‌, ఎల్లమ్మబండ, ఇంద్రాహిల్స్‌, చంద్రమ్మనగర్‌లో శుక్రవారం ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంటు ఉండదని తెలిపారు. అదే శ్రీరామ్‌నగర్‌, సాయిచరణ్‌కాలనీ, ఇందిరాహిల్స్‌, వీకర్‌సెక్షన్‌కాలనీ, హెచ్‌ఎంటీహిల్స్‌లో మధ్యాహ్నం 1నుంచి 2గంటల వరకు విద్యుత్‌ ఉండదని అధికారులు తెలిపారు. విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

632 మంది మీసేవా ఆపరేటర్లపై వేటు

నా గొంతు నొక్కేందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 13 , 2026 | 06:45 AM