కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ భేటీ
ABN , Publish Date - Feb 12 , 2026 | 09:33 PM
దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బేటీ అయ్యారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దృష్టికి వారు తీసుకెళ్లారు.

వానాకాలం పంటకు (2025 - 26 సీజన్) సంబంధించి తెలంగాణ రాష్ట్రం అదనంగా సేకరించిన 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తీసుకోవాలని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. అలాగే యాసంగి ధాన్యం సేకరణ గడువు రెండు నెలలు పొడిగించాలని ఆయన్ని వారు కోరారు. ఇక బాయిల్డ్ రైస్‌లో అయిదు శాతం నూకకు అనుమతించండాలని విజ్ఞప్తి చేశారు.
అదే విధంగా భారత ఆహార సంస్థకు (ఎఫ్‌సీఐ) 2014 -15 వానా కాలంలో సరఫరా చేసిన బియ్యానికి సంబంధించి తెలంగాణకు బకాయి పెట్టిన రూ.1,468.94 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి జోషిని సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. వానా కాలం పంటకు సంబంధించి 53.73 లక్షల మెట్రిక్ టన్నులకు (ఎల్ఎంటీ) అనుమతించారని.. కానీ భారీగా పంట ఉత్పత్తి కావడంతో.. అదనంగా 18 ఎల్ఎంటీలు తాము సేకరించినందున ఆ మొత్తాన్ని 10 శాతం నూకతో ఎఫ్‌సీఐ సేకరించాలని కేంద్ర మంత్రికి వారు విజ్ఞప్తి చేశారు.